Etala Rajender : ఈటల మాట వినేదెవరు ? ఎంపీగా పోటీ ఎక్కడ ?
తెలంగాణ రాష్ట్ర బీజేపీ (Telangana State BJP) లీడర్లలో ఇంకా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ మొదలైన గొడవలు.. పార్టీ ఓటమి తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి. సీనియర్ లీడర్లు ఇప్పటికిప్పుడు కలిసిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు కొత్తగా ఎంపీ సీట్ల లొల్లి స్టార్ట్ అయింది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ (Telangana State BJP) లీడర్లలో ఇంకా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ మొదలైన గొడవలు.. పార్టీ ఓటమి తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి. సీనియర్ లీడర్లు ఇప్పటికిప్పుడు కలిసిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు కొత్తగా ఎంపీ సీట్ల లొల్లి స్టార్ట్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానికుడిగా ఈటల రాజేందర్ ( Etala Rajender) అక్కడి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. కానీ బండి సంజయ్ ని కాదని అధిష్టానం ఆయనకు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో ఈటల ఎంపీగా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
కరీంనగర్ లోక్ సభ (Karimnagar Lok Sabha) నియోజకవర్గం కోసం బీజేపీలో లొల్లి నడుస్తోంది. ఆ సీటును ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ తనకే తిరిగి కేటాయించాలని కోరుతుంటే.. మరో సీనియర్ నేత ఈటల రాజేందర్ కూడా ఆశిస్తున్నారు. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay).. అదే స్థానం నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో పోటీ చేసిన మిగతా బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బాపూరావు పరిస్థితి కూడా అంతే. కానీ ఎందుకో కరీంనగర్ సీటును మారుస్తారు. ఈటల రాజేందర్ కి ఇస్తారని గతంలో వార్తలు వచ్చాయి. ఈటల తన నియోజకవర్గం హుజూర్ నగర్ తో పాటు.. సీఎం కేసీఆర్ (KCR) పై గజ్వేల్ లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. మొన్న బీజేపీ అధిష్టానం ప్రకటించిన పార్లమెంట్ ఇంఛార్జుల లిస్టులో ఈటల పేరు లేకపోవడంతో.. చాలామంది ఆయన్ని పక్కన పెట్టేశారని భావించారు. కానీ ఈటలను పార్లమెంట్ స్థానానికి నిలబెట్టాలన్నది బీజేపీ అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది.
ఈటల రాజేందర్ మాత్రం.. కరీంనగర్ సీటు ఇస్తే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారు. అక్కడ హుజూర్ నగర్ తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. పైగా గతంలో BRS హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు, తెలంగాణ ఉద్యమం టైమ్ లో ఉమ్మడి కరీంనగర్ బాధ్యతలను ఈటలే చూశారు. అందుకే కరీంనగర్ ఎంపీ సీటు అయితే తాను తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం ఉంది. ఆయన అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. అందుకే తన మనసులో మాట కూడా ఈటల బయటపెట్టారు.
కానీ బీజేపీ అధిష్టానం మాత్రం.. బండి సంజయ్ ను కాదని కరీంనగర్ ను ఈటలకు కేటాయించే పరిస్థితి లేదు. అందుకే ఈటలకు మల్కాజ్ గిరి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఎలాగూ కరీంనగర్ రానప్పుడు.. మల్కాజ్ గిరియే బెటర్ అని ఈటల కూడా అధిష్టానానికి చెప్పారు. అయితే ఇదే స్థానం నుంచి పోటీకి బీజేపీలో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్ రావు, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అధినేత మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు తదితరులు పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి ఓట్లు కూడా బాగానే పడ్డాయి. ఈ ఏరియాలో బీజేపీకి కార్పొరేటర్ల బలం కూడా తోడవుతుంది. ఈటల తనకు ఉన్న సొంత ఇమేజ్ తో పాటు.. పార్టీ బలం కలసి వస్తుందనీ.. మల్కాజ్ గిరి అయితేనే ఎంపీగా గెలవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కానీ బీజేపీ అధిష్టానం.. ఈటల మాట వింటుందా.. ఆయన లోక్ సభకు పోటీ చేయడానికి ఇక్కడి నుంచి టిక్కెట్ ఇస్తుందా అన్నది చూడాలి.