కుంభమేళాలోనే నాగసాధువులు ఎందుకు కనిపిస్తారు..? వారికి ఉన్న శక్తులేంటి..?
కుంభమేళా.. 12ఏళ్లకు ఒకసారి జరిగే ఆధ్యాత్మిక సమ్మేళనం. ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులే కాదు... ఎప్పుడూ కనిపించని నాగసాధువులు కూడా తరలివస్తారు. అసలు.. కుంభమేళాకు నాగసాధువులకు ఉన్న సంబంధం ఏంటి..? వారు కుంభమేళాకు మాత్రమే ఎందుకు వస్తారు..?
కుంభమేళా.. 12ఏళ్లకు ఒకసారి జరిగే ఆధ్యాత్మిక సమ్మేళనం. ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులే కాదు… ఎప్పుడూ కనిపించని నాగసాధువులు కూడా తరలివస్తారు. అసలు.. కుంభమేళాకు నాగసాధువులకు ఉన్న సంబంధం ఏంటి..? వారు కుంభమేళాకు మాత్రమే ఎందుకు వస్తారు..?
నాగసాధువులు.. వీరి ఉనికి ఒక రహస్యం. వీరిని శైవ రుషులు అని కూడా పిలుస్తారు. హిమాలయాల్లోని గుహలు, కొండలు, నదీ తీరాలే వీరి నివాసం. ప్రజలకు దూరంగా ఏకాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటారు. సాధారణ రోజుల్లో ఎవరికీ కనిపించరు. కుంభమేళా సమయంలో మాత్రమే హిమాలయాలు దాటి బాహ్య సమాజంలోకి వస్తారు. వీరు దిగంబరంగా ఉంటారు. శరీరమంతా… దట్టంగా బూడిద పూసుకుంటారు. మానవ పుర్రెలను దండగా మెడలో వేసుకుంటారు. చేతిలో త్రిశూలంతో గంభీరంగా కనిపిస్తారు. కొంత మంది.. ఒళ్లంతా రుద్రాక్షలతో కనిపిస్తారు. వీరు యుద్ధ కళల్లో కూడా ప్రావీణ్యులు. కత్తి, త్రిశూలంతోపాటు పలు ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నాగసాధువులకు తెలుసు.
కుంభమేళాకు నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణ. హిమాలయాల నుంచి వారంతా లక్షలాదిగా తరలివస్తారు. వివిధ అకారాలకు చెందిన నాగ సాధువులు కుంభమేళాలో కలుసుకుని వారి ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. వారి సామాజిక బంధాలను బలోపేతం చేసుకుంటారు. నాగసాధువులు… కుంభమేళాకు రావడానికి ప్రధాన కారణం కూడా ఉంది. కుంభమేళా సమయంలో గంగా, యమునా, సరస్వతి సంగమం దగ్గర చేసే రాజస్నానం చాలా పవిత్రమైంది. మూడు పుణ్య నదుల సంగమం దగ్గర చేసే రాజస్నానం.. ఆత్మ శుద్ధి.. మోక్షాన్ని ఇస్తుందని నమ్మకం. అందుకే… నాగసాధువులు ఎక్కడ ఉన్నా… 12ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు లక్షలాదిగా తరలివస్తారు. గంగా, యమునా, సరస్వతి సంగమం దగ్గర రాజస్నానం చేసి.. తమ తపస్సు, సాధన శక్తిని మరింత పెంచుకుంటారు.
నాగసాధువులు శివ భక్తులు. వీరికి కొన్ని శక్తులు కూడా ఉన్నాయని చెప్తుంటారు. అది కుంభమేళా సమయంలో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎలా అంటే… నాగసాధువులు ఉండే హిమాలయాలకు.. కుంభమేళా జరిగే ప్రాంతాలకు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి అక్కడి నుంచి నాగసాధువులు కుంభమేళాకు ఎలా వస్తారు..? ఏ మార్గంలో వస్తారు..? లక్షలాదిగా వచ్చే నాగసాధువులు వారు వచ్చే మార్గంలో ఎవరి కంటా ఎందుకు పడరు..? అన్నది మిస్టరీగానే ఉంంది.
లక్షల మంది నాగసాధువులు… ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. మధ్యలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. మరి… ఆ మార్గంలో ఎవరికైనా కనిపించారా..? అలా ఇప్పటి వరకు నాగసాధువులను ఎవరూ చూడలేదు..? రోడ్డుమార్గంలో గానీ.. రైళ్లు, బస్సుల్లో గానీ… విమానాల్లో కూడా… ఎక్కడా వారు ప్రయాణించిన ఆనవాళ్లు ఉండవు. అయినా… అందరూ ఒకేసారి కుంభమేళా జరిగే ప్రాంతంలో ప్రత్యక్షమవుతారు. ఇది ఎలా సాధ్యం..? అంతేకాదు.. కంభమేళా అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ… నాగసాధువులు ఒక కిలోమీటరు దూరం వెళ్లడం మాత్రమే తెలుస్తుందట. ఆ తర్వాత వారు ఎలా వెళ్లారు…? ఎటువైపు వెళ్లారని ఎవరికీ తెలియదు..? హఠాత్తుగా మాయమైపోతారు. ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారు కనిపించరు. మరి వాళ్లు వెళ్లే మార్గం ఏంటి..? అంటే… సూక్ష్మశరీర యానం అని చెప్తున్నారు కొంతమంది. నాగసాధువులు తమ ప్రయాణానికి సూక్ష్మశరీర యానాన్నే ఎంచుకుంటారని.. అందువల్లే.. కుంభమేళాకు వచ్చే సమయంలో గానీ.. వెళ్లే సమయంలో గానీ.. ఎవరికీ కనిపించరని అంటున్నారు.