ఎందుకంత కంగారు… అనవసరంగా రనౌటైన కోహ్లీ

క్రికెట్ లో రనౌట్ అంటే బ్యాటర్ తప్పిదమే ఎక్కువగా ఉంటుంది. తాజాగా ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ చేజేతులా తన వికెట్ తానే ఇచ్చుకున్నాడు. ఇప్పటికే పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కోహ్లీ‌.. మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 2, 2024 | 11:38 AMLast Updated on: Nov 02, 2024 | 11:38 AM

Why Is Kohli Who Has Run Out Unnecessarily

క్రికెట్ లో రనౌట్ అంటే బ్యాటర్ తప్పిదమే ఎక్కువగా ఉంటుంది. తాజాగా ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ చేజేతులా తన వికెట్ తానే ఇచ్చుకున్నాడు. ఇప్పటికే పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కోహ్లీ‌.. మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. బౌండరీతో బ్యాటింగ్ మొదలుపెట్టిన విరాట్ అనవసర పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటాడుకున్న కోహ్లీ.. తన కంగారుతో టీమ్‌కు మరింత నష్టం చేశాడు. మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న మ్యాట్ హెన్రీ వేగంగా బంతిని అందుకొని బౌలర్ ఎండ్‌వైపు వికెట్లను డైరెక్ట్ హిట్ చేశాడు. కోహ్లీ డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో టీమిండియా 8 బంతులు 6 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. కోహ్లీ ఆ పరుగు తీయకుండా ఉండి ఉంటే తొలి రోజు ఆటలో టీమిండియాదే పైచేయిగా నిలిచేది.