BJP MLA Rajasingh : రాజాసింగ్ సస్పెన్షన్ పై బీజేపీలో సందిగ్ధత ఎందుకు..?
రాజాసింగ్ సస్పెన్షన్ పై బీజేపీలో మౌనం ఎందుకు..? రాజాసింగ్ సస్పెన్షన్ పై బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు ఎందుకు స్పందించడం లేదు..? రాజాసింగ్ కు బీజేపీ కి మధ్య గ్యాప్ పెరిగిందా..? ఈ సారి రాజాసింగ్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తాడా..?
గోషామహల్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 2018 అసెంబ్లీలో ఎనిక్కలల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ టికెట్‌పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బీజేపీ మాస్ లీడర్ రాజాసింగ్. గత కొన్ని నెలలుగా గోషామహల్ లో రాజకీయం వేడెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగే.. మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పాతబస్తీలో ఎప్పుడు లేనంతగా.. పెద్ద ఎత్తున ముస్లింలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. దానికి తోడు మజ్లిస్ నేతలు మహమ్మద్ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం కేంద్ర బీజేపీ కార్యాలయంకు చేరడంతో బీజేపీ తక్షణమే రాజాసింగ్ పై సస్పెన్షన్ విధించింది.
ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి, దివంగత ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌తో సమావేశమై స్థానికంగా నెలకొన్న సమస్యలపై చర్చించారు. తమ కుటుంబానికి గోషామహల్ కు విడదీయరాని సంబంధం ఉన్నట్లు ఖచ్చితంగా ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఈటలతో విక్రమ్ గౌడ్ చెప్పినట్లు సమాచారం. ఈ భేటీలో రాబోయే ఎన్నికల్లో గోషామహల్ నుంచి రాజాసింగ్ స్థానం బీజేపీ తరఫున విక్రమ్ గౌడ్ ని భరిలోకి దింపుతారని వార్తలు వచ్చినప్పటికీ ఇంకా దీనిపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ సందర్భంగా విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ కూడా గోషామహల్ సీటు తనదే అని రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచే తను పోటీ చేస్తానని చెప్పారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కూడా అడుగుతాను తెలిపారు విక్రమ్ గౌడ్.బీజేపీ టికెట్ నాకు వచ్చిన రాజాసింగ్ సేవలు పార్టీకి ఎంతో అవసరమన్నారు విక్రమ్ గౌడ్. రాజాసింగ్ సస్పెన్షన్ విషయంలో అధిష్టానంతో మాట్లాడి చర్యలు తీసుకుంటుందన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ పై బీజేపీ మౌనం ఇందుకేనా..?
రాజాసింగ్ సస్పెన్షన్‌పై జాప్యానికి ప్రధాన కారణం గోషామహల్ స్థానాన్ని ఖాళీ చేయకపోవడమేనని వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాజాసింగ్‌కు బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ దానికి రాజాసింగ్ సుముఖంగా లేడని సమాచారం. గోషామహల్ నుంచి పోటీ చేస్తానని, ఇక్కడ్నుంచి మరో నియోజకవర్గానికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎంత సర్ది చెప్పినప్పటికి రాజాసింగ్ మాత్రం ఈ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు అని బీజేపీ వర్గాల్లో గుసగుసలు.
సస్పెన్షన్ ఎత్తివేస్తే పోటీ చేస్తా.. లేదంటే ధర్మం కోసం పనిచేస్తా..!
గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్‌కు మంచి పట్టుంది అని బీజేపీ అధిష్ఠనంతో సహ అందరికి తెలిసిందే. మద్దతుదారులు కూడా ఈ నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడికి వెళ్లొద్దని రాజాసింగ్ కు సూచించినట్లు సమాచారం. బుధవారం గోషామహల్ లో రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ క్యాండిడేట్ల ఫస్ట్ లిస్ట్ లో తన పేరు ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ధీమ వ్యక్తం చేశారు. తనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేస్తారనే నమ్మకం ఉందని.. జాతీయ పార్టీ, రాష్ట్ర నేతలు తనకు అండగా ఉన్నారని వెల్లడించారు. రాజాసింగ్ గోషామహల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని పలు మార్లు చెప్పినపట్టికి.. బీజేపీ నాకు టికెట్ ఇస్తే పోటీ చేస్తానని.. లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటాను అని వెల్లడించారు. ఎట్టి పరిస్థితిలో ఇండిపెండెంట్ గా మాత్రం పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు రాజాసింగ్. ఇదే సందర్భంగా తన నియోజకవర్గాంలో బీజేపీ టికెట్ ఎవరికి ఇచ్చినా నా మద్దతిస్తానని వెల్లడించారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే హిందూ ధర్మం కోసం పని చేసుకుంటా అని పేర్కొన్నారు. ఇతర పార్టీల మద్దతు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఏం ఏది అయిన ఈ సారి గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిని మార్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని.. చివరి వరకు గోషామహల్ సస్పెన్స్ లో ఉంటుంది. విక్రమ్ గౌడ్ కే టికెట్ ఇచ్చేందుకు బీజేపీ యోచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
గోషామహల్ బీఆర్ఎస్ కు దొరకని అభ్యర్థి..!
రాష్ట్రంలో ఏ పార్టీలో లేని ఎలక్షన్ మూమెంట్ ఒక్క బీఆర్ఎస్ పార్టీలో స్పష్టం ఉన్నట్లు కనిపింస్తుంది. అందుకు అనుగుణంగా కేసీఆర్ ఒకే సారి అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేయడం కేటీఆర్, హరీష్ రావు జిల్లాల వారీగా సుడిగాలి పర్యటనలు చేయడం అనని చక చక జరిగిపోతున్నాయి. కేసీఆర్ ఈ సారి ఎలాగైనా గోషామహల్ లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని.. అందుకు బీజేపీ నుంచి ఎవరు పొట్టి లోకి దిగిన వారిని మట్టి కరిపించే అభ్యర్థి కోసం వెతుకుతున్నాట్లు సమాచారం.
S.SURESH