మీరేమైనా దిగొచ్చారా… మూసుకుని రంజీలు ఆడండి

న్యూజిలాండ్ తో వైట్ వాష్ పరాభవం ఇద్దరు స్టార్ ప్లేయర్స్ కెరీర్ కు ఎసరు పెట్టేలా ఉంది.. ఈ ఘోరపరాజయం తర్వాత అందరూ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీలనే టార్గెట్ చేశారు. సీనియర్ బ్యాటర్లు అయి ఉండి స్పిన్ ను ఎదుర్కోలేకి వీరిద్దరూ చేతులెత్తేయడం చాలా మందికి కోపం తెప్పించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2024 | 06:57 PMLast Updated on: Nov 09, 2024 | 6:57 PM

Why Team India Star Players Didnt Play Ranji Matches

న్యూజిలాండ్ తో వైట్ వాష్ పరాభవం ఇద్దరు స్టార్ ప్లేయర్స్ కెరీర్ కు ఎసరు పెట్టేలా ఉంది.. ఈ ఘోరపరాజయం తర్వాత అందరూ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీలనే టార్గెట్ చేశారు. సీనియర్ బ్యాటర్లు అయి ఉండి స్పిన్ ను ఎదుర్కోలేకి వీరిద్దరూ చేతులెత్తేయడం చాలా మందికి కోపం తెప్పించింది. అందుకే వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించాలన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే కొందరు మాజీ ఆటగాళ్ళు మాత్రం రోహిత్ , కోహ్లీలు దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచిస్తున్నారు. ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న వీరిద్దరూ రంజీలతోనే మళ్ళీ గాడినపడతారని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు. బీసీసీఐ వీళ్ళకు ఎందుకు స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తుందో అర్థం కావడం లేదన్నాడు. జట్టు ఎంపికలోకి దేశవాళీ క్రికెట్ ప్రదర్శనే ప్రామాణికమన్న విషయం అందరికీ వర్తిస్తుందన్నాడు.

ప్లేయర్లు ఫామ్‌లో లేరంటే వారికి సరైన ప్రాక్టీస్ దొరకడం లేదన్నదే కారణమని చెప్పాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడితే గేమ్ టైమ్ దొరుకుతుందని కైఫ్ విశ్లేషించాడు. పూజారా, గంగూలీ , సెహ్వాగ్ వంటి ప్లేయర్లు కూడా గతంలో దేశవాళీ టోర్నీల్లో ఆడిన ఫామ్ అందుకుని తిరిగి జాతీయ జట్టులోకి వచ్చారని గుర్తు చేశాడు. లగ్జరీ ట్రీట్ మెంట్ కావాలంటూ ప్రతీసారీ కుదరదంటూ కైఫ్ చురకలు అంటించాడు.పెద్ద కార్లలో ప్రయాణించాలి, ఫ్లైయిట్స్‌లో తిరగాలి వంటి కోరుతూ దేశవాళీ టోర్నీల్లో మాత్రం ఆడమంటే కుదరదన్నాడు. కోహ్లీ, రోహిత్ లే కాదు ఎవ్వరైనా సరే, ఎంతటి వారైనా ఫామ్‌లో లేకపోతే దేశవాళీ టోర్నీల్లో ఆడి తీరాల్సిందేనని మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు.

సీనియర్లు, స్పిన్ బౌలింగ్ ఆడేందుకు కూడా ఇబ్బంది పడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిందని కైఫ్ చెప్పుకొచ్చాడు. రంజీ మ్యాచ్ లలో విభిన్న జట్లకు చెందిన స్పిన్నర్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని, మ్యాచ్ ప్రాక్టీస్ కూడా కావాల్సినంత దొరుకుతుందన్నాడు. రోహిత్, కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్స్ మళ్ళీ రంజీలు ఆడితే సహచర ఆటగాళ్ళకు స్ఫూర్తినిచ్చినట్టవుతుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా జట్టులో చోటు కోల్పోయిన ఆటగాళ్ళు, ఫామ్ లో లేని వారంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని కొత్త కోచ్ గంభీర్ కండీషన్ పెట్టాడు. అయితే బీసీసీఐ మాత్రం కొందరు సీనియర్లకు దీని నుంచి మినహాయింపునివ్వడం విమర్శలకు తావిస్తోంది.