Weather update : తెలంగాణ వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు.. శాంతించిన గోదావరి నది
హైదరాబాద్‌లో నిన్న నుంచి వర్షపు తొలకరి చునుకులు ఆగకుండా కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ముసురు ఎప్పుడు పోతుంది? వారం రోజులుగా కనిపించకుండా పోయినా సూరీడు ఎప్పుడు వస్తాడని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్‌లో నిన్న నుంచి వర్షపు తొలకరి చునుకులు ఆగకుండా కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ముసురు ఎప్పుడు పోతుంది? వారం రోజులుగా కనిపించకుండా పోయినా సూరీడు ఎప్పుడు వస్తాడని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, వరంగల్, హన్మకొండ జనగాం, కామారెడ్డి జిల్లాల్లో.. భారీ ఈదురు గాలులు, ఉరములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. ఇక ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండగా మారాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
శాంతించిన గోదారి…
మరో వైపు ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో నీటి మట్టం పెరుగుతున్న విషయం తెలిసిందే.. గత మూడ్రోజులు గోదావరి నది వరద ప్రవాహం పెరగటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా మంగళవారం రాత్రి నుంచి గోదావరిలో వరద నీటిమట్ట తగ్గుముఖం పడుతుంది. దీంతో మంగళవారం ఉ దయం10 గంటల వరకు 51.60 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం రాత్రి 9 గంటల నాటికి 50.10 అడుగులకు చేరింది. దీంతో గోదారి శాంతించన నేపథ్యంలో గోదావరి ముంపు మండలాలు ఊపిరి పీల్చుకున్నారు. ఏపీలో రాబోయే 3 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.