ఫ్రెండ్స్‌తో తిరుగు.. అడ్డు చెప్పను.. కాబోయే భర్తకు యువతి అగ్రిమెంట్..
ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి.. ఇవే పెళ్లినాటి చేసే ప్రమాణాలు. ధర్మం, సంపద, శారీరక సుఖం, మోక్షం విషయంలో విడిచిపెట్టను అని దంపతులు ఒకరికి ఒకరు చేసుకునే ప్రమాణం ఇది. ఐతే తమిళనాడులో ఓ జంట మాత్రం.. ఇంకో ప్రమాణం యాడ్ చేసింది.
ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి.. ఇవే పెళ్లినాటి చేసే ప్రమాణాలు. ధర్మం, సంపద, శారీరక సుఖం, మోక్షం విషయంలో విడిచిపెట్టను అని దంపతులు ఒకరికి ఒకరు చేసుకునే ప్రమాణం ఇది. ఐతే తమిళనాడులో ఓ జంట మాత్రం.. ఇంకో ప్రమాణం యాడ్ చేసింది. ఏంటి ఇలాంటి ప్రమాణాలు ఉంటాయా.. ఇలా కూడా అగ్రిమెంట్ రాసుకుంటారా.. ఇదెక్కడి మాస్ రా మావా అని ఆశ్చర్యపోతారు మీరు కూడా ! పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయాడు రా అంటూ, భార్య కొంగు పట్టుకు తిరుగుతున్నాడు అని.. పెళ్లైన యువకుడిని ఏడిపించే ఫ్రెండ్స్‌ను ఎంతోమందిని చూస్తూనే ఉంటాం.
అలాంటి పరిస్థితి తమకు రాకూడదు అనుకున్నారో ఏమో కానీ.. ఆ ఫ్రెండ్స్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్నేహితుడు పెళ్లికి వెళ్లి.. అతనికి కాబోయే భార్యతో బాండ్ పేపర్‌పై సంతకం చేయించుకున్నారు. పెళ్లి తర్వాత కూడా… తాము ఇంతకుముందులా కలిసి తిరిగినట్లు, ఎంజాయ్ చేసినట్లు అవకాశం ఇవ్వాలని.. వాటికి అడ్డు చెప్పకూడదంటూ తమ స్నేహితుడి కాబోయే భార్యకు షరతులు విధించారు. బాండ్ పేపర్‌పై సంతకాలు కూడా చేయించుకున్నారు. తమిళనాడులోని మైలాడుదురై జిల్లా శీర్గాలిలో జరిగింది ఈ ఘటన. పవిత్రతో ముత్తుకుమార్ పెళ్లి ఫిక్స్ కాగా.. అతని ఫ్రెండ్స్ అంతా ఆ వివాహానికి హాజరయ్యారు.
వంద రూపాయల బాండ్ పేపర్‌తో ఫంక్షన్ హాల్‌లో ల్యాండ్ అయ్యారు. స్నేహితుడి భార్యతో మాట్లాడారు. రకరకాల కండిషన్లు పెట్టి.. బాండ్ పేపర్ మీద సంతకం చేయించుకొని.. ఆ తర్వాత ముత్తుకుమార్‌ను వదిలిపెట్టారు. ఈ బాండ్ పేపర్ చదువుకున్న వధువు, ఆమె కుటుంబీకులు.. దీన్ని సరదాగా తీసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ ఫ్రెండ్ తమతో తిరిగేందుకు అభ్యంతరం లేకుండా ఆమె భార్యతో సంతకం చేయించుకున్న తర్వాతే పెళ్లి ప్రక్రియ ముందుకు వెళ్లేలా చేయడంతో.. ఆ స్నేహితులు సరికొత్త వ్యవహారానికి నాంది పలికినట్లు అయిందంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.