Team India : మరో విజయంతో ముగిస్తారా ? జింబాబ్వేతో ఇవాళ చివరి టీ20
జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న యంగ్ ఇండియా విజయంతో టూర్ ను ముగించాలని ఉవ్విళ్ళూరుతోంది.

Will it end with another win? Today is the last T20 against Zimbabwe
జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న యంగ్ ఇండియా విజయంతో టూర్ ను ముగించాలని ఉవ్విళ్ళూరుతోంది. సిరీస్ గెలిచిన నేపథ్యంలో రిజర్వ్ బెంచ్ లో ఆటగాళ్ళను ఆడించే అవకాశముంది. రొటేషన్ లో భాగంగా జైశ్వాల్, సంజూ శాంసన్ లకు రెస్ట్ ఇవ్వనున్నారు. దీంతో అభిషేక్ శర్మ మళ్ళీ ఓపెనర్ గా రానున్నాడు. ఇక వికెట్ కీపర్ గా సంజూ స్థానంలో జురెల్ కు చోటు దక్కనుంది. శ్రీలంక పర్యటనకు కూడా దాదాపు ఇదే జట్టు ఎంపికయ్యే అవకాశముండడంతో యువ క్రికెటర్లు తమ ఫామ్ కొనసాగించాలని పట్టుదలగా ఉన్నారు. తొలి ట్వంటీలో గెలిచిన జింబాబ్వే తర్వాత పెద్దగా పోటీ ఇవ్వకపోతుండడంతో ఈ సిరీస్ ను యంగ్ ఇండియా 4-1తో గెలవడం ఖాయంగానే కనిపిస్తోంది.