Sharukh: షారుక్ జవాన్ పఠాన్ ని మించి పోతుందా..?

షారూఖాన్ కి మరో హిట్ గ్యారెంటీనా.. పఠాన్ చరిత్రను జవాన్ తిరగరాస్తుందా..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 7, 2023 | 11:28 AMLast Updated on: Sep 07, 2023 | 11:28 AM

Will Jawaan Break Shahrukh Khan Pathans Collections

పఠాన్ సూపర్‌హిట్‌ తర్వాత బాలీవుడ్డే కాదు.. తెలుగు, తమిళ ప్రేక్షకుల దృష్టి జవాన్‌పై పడింది. బాలీవుడ్‌ హీరోలను పట్టించుకోని మనస్టార్స్.. జవాన్‌ రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. జవాన్‌ పఠాన్‌ వసూళ్లను మించిపోతుందా? హిందీలోనే కాదు.. తెలుగు, తమిళంలో జవాన్‌కు సూపర్ క్రేజ్ పెరిగింది.

గురువారం రిలీజ్‌ అవుతున్న జవాన్‌ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని మహేశ్‌ ట్వీట్‌ చేస్తూ. బెస్ట్ విషెస్‌ తెలియజేశాడు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తానని మహేశ్ ట్వీట్ చేశాడు. మహేశ్‌ ట్వీట్‌కు షారూక్‌ థ్యాంక్స్‌ చెబుతూ.. సినిమా ఎప్పుడు చూడాలనుకుంటున్నావో చెబితే.. నేనూ నీతో కలిసి సినిమాకి వస్తానన్న షారూక్‌ ట్వీట్‌ వైరల్‌ అయింది. పఠాన్‌ మొదటి రోజు 57 కోట్ల నెట్ కలెక్ట్‌ చేసి అప్పటివరకు కెజిఎఫ్‌2 పేరు మీదున్న రికార్డ్‌ను బ్రేక్‌ చేసింది. బాహుబలి 511 కోట్లు కలెక్ట్ చేసి టాప్‌ ప్లేస్‌లో వుంటే.. 524 కోట్లతో పఠాన్‌ నెంబర్‌ఒన్‌కు చేరింది. జవాన్‌తో షారూక్‌ తన రికార్డ్‌ను తనే బ్రేక్‌ చేసే అవకాశం వుంది.
తమిళ దర్శకుడు అట్లీ జవాన్‌ను డైరెక్ట్‌ చేయడంతో తమిళంలో భారీ ఓపెనింగ్స్ వస్తాయి. షారూక్‌ ఇందులో 7 గెటప్స్‌లో కనిపిస్తాడట. కీలక సన్నివేశం కోసం.. హిందీ వెర్షన్‌లో సంజయ్‌దత్‌, తెలుగులో అల్లు అర్జున్‌.. తమిళ వెర్షన్‌లో విజయ్‌ కనిపిస్తాడన్న వార్తలు వస్తున్నాయి. కలిసొచ్చిన భామ దీపిక పదుకునే గెస్ట్ రోల్లో తళుక్కుమంటోంది. జవాన్‌తో నయనతార బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.