Pavan Movies : డిప్యూటీ సీఎం అయితే పవన్ నటిస్తాడా ?
ఏపీలో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే... పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవుతాడని టాక్ నడుస్తోంది. ఆ పదవితో పాటు కీలకమైన మంత్రి పదవి కూడా వస్తుంది.
ఏపీలో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే… పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవుతాడని టాక్ నడుస్తోంది. ఆ పదవితో పాటు కీలకమైన మంత్రి పదవి కూడా వస్తుంది. మరి పవన్ డిప్యూటీ అయితే సినిమాల్లో నటిస్తాడా ? అధికారంలోకి రాకపోయినా… ఎమ్మెల్యేగా ఎన్నికైనా నటిస్తాడా… ఇప్పటికే సగంలో ఆగిన మూడు సినిమాల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
పవన్ కల్యాణ్ సినిమాల కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. కథ బాగుంటే… సినిమా హిట్టు కొట్టినట్టే. పవన్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తాడన్న టాక్ ఉంది. ఎన్నికల కంటే మూడు నెలల ముందు నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. పూర్తి టైమ్ పాలిటిక్స్ మీదే దృష్టి పెట్టాడు పవన్. జూన్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే… పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడం ఖాయమని అంటున్నారు. దీనికి తోడు… ప్రభుత్వంలో కుదురుకోవడం… పథకాలు, విధి విధానాలపై పనిచేయడం లాంటి పనులకు నెలా, రెండు నెలల టైమ్ పట్టొచ్చు. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ సినిమాల్లో ఎంతవరకూ నటిస్తాడని సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తోంది.
మొన్నటిదాకా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి… పవన్ ఫిట్నెస్ కోల్పోయాడు. రెండు, మూడు సార్లు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఆయన పూర్తిగా ఫిట్ అయితే తప్ప సినిమాల్లో నటించడానికి ఇష్టపడడు అని అభిమానులు చెబుతున్నారు. గ్లామర్ లేకపోతే మూవీస్ లో నటించినా వేస్టే అంటున్నారు. అంటే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా… రాకున్నా… పవన్ మాత్రం ఆగస్టు తర్వాతే సినిమాల్లో నటించే ఛాన్సుది. ఫస్ట్… మధ్యలోనే ఆగిన ఓజీ సినిమాకు డేట్స్ కేటాయిస్తాడని చెబుతున్నారు. ఆ తర్వాత హరి హర వీరమల్లు సినిమాకు, ఉస్తాద్ భగత్ సింగ్ కు పవన్ కల్యాణ్ టైమ్ కేటాయించే అవకాశముంది. కూటమి అధికారంలోకి వచ్చి పవన్ డిప్యూటీ సీఎం అయినా… ఈ మూడు ప్రాజెక్టులను మాత్రం కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే నిర్మాతలు భారీగా నష్టపోతారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే… తర్వాత సినిమాల్లో నటిస్తాడా… లేదా అన్నది అప్పుడు నిర్ణయించే ఛాన్సుందని అభిమానులు చెబుతున్నారు.