OG Vs Salaar: ఒజాస్ గంభీర వర్సెస్ సలార్.. సలార్ వర్సెస్ గుంటూరు కారం?
ఈ సారి ఓజీకి సలార్ పోటీగా నిలువబోతుందా.

Will Pawan Kalyan compete with Prabhas this time
సలార్ మూవీ పవర్ స్టార్ సినిమాకు మధ్య వార్ కన్ఫామ్ అయ్యేలా ఉంది. సలార్ దసరా నుంచి సంక్రాంతి, సమ్మర్ వరకు ఎప్పుడైనా రావొచ్చు. ఈనెల 28 న విడుదలవ్వాల్సిన మూవీ వాయిదా పడింది కాబట్టి, రిలీజ్ డేట్ ఎప్పుడా అనే డౌట్ రాకముందే, పవన్ సినిమాతో పోటీ అని కన్ఫామ్ అయ్యింది.
సలార్ సినిమా దసరా, దీపావళికి రావటం కష్టమే. వస్తే క్రిస్మస్ లేదంటే సక్రాంతి, కాదంటే సమ్మర్ కే రావాలి. అదేజరిగితే పవన్ రెండు సినిమాల్లో ఏదో ఒక మూవీతో సలార్ టక్కర్ కన్ఫామ్ అనుకోవాల్సిందే. ఎందుకంటే పవన్ ఓజీ మూవీ వస్తే క్రిస్మస్ కి రావొచ్చు లేదంటే సంక్రాంతికి విడుదలవ్వొచ్చు. అలానే ప్లాన్ చేస్తోంది ఫిల్మ్ టీం.
ఇక పవన్ తో హరీష్ శంకర్ తీస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఇది మాత్రం సమ్మర్ కి విడుదలౌతుందని తెలుస్తోంది. సో క్రిస్మస్ లేదంటే సంక్రాంతికి వచ్చే ఛాన్స్ఉన్న ఓజీ తో లేదంటే సమ్మర్ లో వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ తో సలార్ పోటీ కన్ఫామ్ అనుకోవాల్సిందే. ఒకవేళ సలార్ సంక్రాంతికే వస్తే మాత్రం, అప్పుడు ఓజీ, గుంటూరు కారం ఇలా రెండీంటితో పోటీ పడక తప్పదు. సమ్మర్ లో వచ్చినా అంతే, వేసవిలో అయితే పుష్ప, దేవర కూడా సలార్ కి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.