Pranay Amrutha: అమృత ప్రణయ్ సినిమాల్లోకి రాబోతోందా ?
ప్రణయ్ అమృత సినిమాల్లో నటించనున్నారా..

Will Pranay Amrita make an entry in Tollywood movies
మిర్యాలగూడ పరువు హత్య గురించి తెలియని వారు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘటన రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. భార్య అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లి వస్తుండగా.. దారిలో ప్రణయ్‌ను అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటనపై రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. హత్యకు కారణం అయిన అమృత తండ్రి మారుతీరావు మీద ప్రతీ ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మారుతి రావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కట్ చేస్తే నాలుగేళ్లు దాటింది. ప్రణయ్ లేడు అనే విషాదం నుంచి అమృత కుటుంబం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. కొడుకు వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ.. అందరితోనూ పంచుకుంటోంది.
ప్రణయ్‌తో పెళ్లి తర్వాత.. కుటుంబానికి దూరం అయిన అమృత.. ఇప్పుడిప్పుడు తన తల్లికి దగ్గర అవుతోంది. ఇదంతా ఎలా ఉన్నా.. అమృత ప్రణయ్‌కు సంబంధించి ఇప్పుడో న్యూస్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమృత సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా అనే డిస్కషన్ నడు్సతోంది. ఈ మధ్య బెదురులంక 2012 మూవీ ప్రమోషన్స్‌లో హీరో కార్తికేయతో డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అమృత. వెన్నెల్లో ఆడపిల్ల.. కవ్వించే కన్నెపిల్ల అంటూ చేసిన ఈ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా రొమాంటిక్‌గా కనిపిస్తున్న ఈ డ్యాన్స్.. ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోను చూసిన వారి నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ప్రణయ్‌ని మరిచిపోయిందని.. సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందని అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఐతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తున్న అమృత.. సినిమాల్లో ఎంట్రీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వాళ్లతోనూ టచ్‌లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అమృత ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చూస్తే.. త్వరలో సినిమాల్లోకి రావడం కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తోంది. మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్య జరిగింది. ఆ తర్వాత అమృత కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకు వస్తోంది.