ఆల్ రౌండర్లతో నింపేసిన ప్రీతిజింతా, పంజాబ్ టైటిల్ కల తీరేనా ?
పంజాబ్ కింగ్స్ అత్యధిక పర్స్ వాల్యూతో వేలంలోకి ప్రవేశించింది. వేలానికి ముందు ఆ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. తమ పర్సులో కోట్లాది రూపాయలు ఉండటంతో పంజాబ్ అత్యధికంగా శ్రేయాస్ అయ్యర్‌ను 26.75 కోట్లకు కొనుగోలు చేసింది.
పంజాబ్ కింగ్స్ అత్యధిక పర్స్ వాల్యూతో వేలంలోకి ప్రవేశించింది. వేలానికి ముందు ఆ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. తమ పర్సులో కోట్లాది రూపాయలు ఉండటంతో పంజాబ్ అత్యధికంగా శ్రేయాస్ అయ్యర్‌ను 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది కాకుండా ప్రపంచంలోని ముగ్గురు స్టార్ ఆల్ రౌండర్ ఆటగాళ్లతో సహా చాలా మంది స్టార్ ఆటగాళ్లను చేర్చుకుంది. పంజాబ్ వ్యూహం చూసి ఇతర ఫ్రాంచైజీలు కూడా షాకవుతున్నాయి. తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రీతిజింతా పక్క ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తుంది.
వేలంలో పంజాబ్ కింగ్స్ మార్కస్ స్టోయినిస్‌ను 11 కోట్లకు కొనుగోలు చేసింది. స్టోయినిస్ ఐపీఎల్ కెరీర్‌ని పంజాబ్ తోనే ప్రారంభించాడు. మార్కస్ స్టోయినిస్ ఇప్పటి వరకు 96 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1866 పరుగులు చేశాడు. అతని పేరిట 43 వికెట్లు కూడా ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 124 నాటౌట్.అత్యుత్తమంగా 15 పరుగులకు 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. గత సీజన్‌లో అతను లక్నో కోసం కష్టపడ్డాడు. లక్నో కంటే ముందు స్టోయినిస్ పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మరియు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. మెగా వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ 4.20 కోట్లకు కొనుగోలు చేసింది.
గత సీజన్‌లో మాక్స్‌వెల్‌ను ఆర్సీబీ 11 కోట్ల రూపాయలకు అట్టిపెట్టుకుంది. గ్లెన్ మాక్స్‌వెల్ ఇంతకు ముందు కూడా పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాదు. అయితే గత సీజన్లో మ్యాక్సీ తీవ్రంగా నిరాశపరిచాడు. 9 మ్యాచ్‌లలో 5.77 సగటుతో 52 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 28 పరుగులు మాత్రమే. దీంతోపాటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. అయితే మాక్స్‌వెల్ గతంలో పంజాబ్ కింగ్స్‌కు బలమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. గ్లెన్ మాక్స్‌వెల్ కు కాస్త సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే సంచలనాలు సృష్టిస్తాడని భావించిన పంజాబ్ అతడిని తమ జట్టులో చేర్చుకుంది. ఫ్యాన్స్ కూడా గ్లెన్ మాక్స్‌వెల్ ఆల్ రౌండర్ షోని ఆస్వాదించాలనుకుంటున్నారు. ఇక వేలంలో మార్కో జాన్సెన్‌ను పంజాబ్ కింగ్స్ 7 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అతను సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడాడు. యాన్సెన్ గొప్ప ఆల్ రౌండర్. లాంగ్ సిక్సర్లు కొట్టడంలో స్పెషలిస్ట్. మార్కో జాన్సెన్ ఇప్పటి వరకు 21 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు.100 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 600 పరుగులు చేశాడు.