రఘురామ దారెటు.. అసెంబ్లీకి పోటీ చేస్తారా ?

టికెట్‌ రాకపోతే కానీ తెలియలేదు రఘురామకు.. రాజకీయాలు (politics) క్రూరంగా ఉంటాయని! బీజేపీ నుంచి నర్సాపురం టికెట్ ఆశించిన రఘురామ (Raghurama) కు.. కమలం పార్టీ భారీ ఝలక్ ఇచ్చింది. దీంతో ఆయన ఫేస్‌బుక్ లైవ్‌ పెట్టి మరీ.. ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ రాకపోయినా.. ప్రజాక్షేత్రంలోనే ఉంటానని.. జగన్‌ (Jagan) అంతు చూస్తానని.. రఘురామ సవాల్‌ విసురుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2024 | 04:11 PMLast Updated on: Mar 25, 2024 | 4:11 PM

Will Raghurama Daretu Contest For The Assembly

టికెట్‌ రాకపోతే కానీ తెలియలేదు రఘురామకు.. రాజకీయాలు (politics) క్రూరంగా ఉంటాయని! బీజేపీ నుంచి నర్సాపురం టికెట్ ఆశించిన రఘురామ (Raghurama) కు.. కమలం పార్టీ భారీ ఝలక్ ఇచ్చింది. దీంతో ఆయన ఫేస్‌బుక్ లైవ్‌ పెట్టి మరీ.. ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ రాకపోయినా.. ప్రజాక్షేత్రంలోనే ఉంటానని.. జగన్‌ (Jagan) అంతు చూస్తానని.. రఘురామ సవాల్‌ విసురుతున్నారు. నిజానికి రఘురామను గతంలోనే చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. కారణం ఏదైనా.. ఆ సమయంలో రఘురామ ఆసక్తి చూపించలేదు.

బీజేపీ (BJP) మీదే హోప్స్‌ పెట్టుకున్నారు. వైసీపీ (YCP) లోనే రెబల్‌గా ఉండి.. జగన్‌కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో గళం వినిపించారు. ఆ తర్వాత జగన్ మీద కేసులు కూడా వేశారు. ఐతే తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి.. రఘురామకు టికెట్ లేకుండా పోయింది. న‌ర‌సాపురంలో బీజేపీ వేరే వారికి టికెట్ ఇచ్చేసింది. దీంతో ర‌ఘురామ ప‌రిస్థితి ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది. దాదాపు ఇప్పుడు ఉన్న పార్లమెంటు సీట్లు అన్నీ కూడా ఫిల్ అయిపోయాయ్. ఒక‌టి రెండు ఖాళీలున్నా.. వాటికి కూడా ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు.

దీంతో ర‌ఘురామ‌కు దాదాపు అవకాశం లేనట్లే. చాన్స్‌ ఏదైనా ఉంటే అది అసెంబ్లీకి మాత్రమే. మ‌రి ఆయ‌న అసెంబ్లీకి పోటీ చేస్తారా.. లేదా అనేది చూడాలి. వైసీపీని గ‌ట్టిగా వ్యతిరేకిస్తున్న ర‌ఘురామ‌ను అసెంబ్లీకి పంపించాల‌ని భావిస్తున్నార‌నే చ‌ర్చ తెరమీదకు వస్తోంది. బీజేపీ తీసుకున్న 10 సీట్లలో ఒక‌దానికి ర‌ఘురామ‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఆయ‌న‌ను అసెంబ్లీకి పంపించ‌డం ద్వారా వైసీపీని అడుగ‌డుగునా నిలువ‌రించే ప‌రిస్థితి ఉంటుంద‌ని వారి అంచనా. మ‌రి ఆయ‌న దీనికి సిద్ధంగా ఉంటారా లేదా… అస‌లు ఇది నిజం అవుతుందా లేదా అనేది ఆసక్తికర చర్చకు కారణం అవుతోంది.