Ram Charan: కనీసం ఇప్పుడైనా వదులుతారా..?
సాంగ్ లీకేజి తర్వాత దిల్ రాజు గేమ్ ఛేంజ్ చేశాడా? ఇక పాటని అఫీషియల్ గానే లాంచ్ చేస్తారా? వినాయక చవితికి మెగా పవర్ స్టార్ సర్ ప్రైజ్

Will Ram Charan release a song on Vinayaka Chavthi in Game Changer
రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ కోసం వేయిట్ చేస్తున్నారు. రెండేళ్లుగా షూటింగ్ తప్ప అప్ డేట్స్ లేకుండా సింగిల్ గ్లింప్స్ తో సరిపెట్టాడు శంకర్. ఇలాంటి టైంలోనే ఈ మూవీ పాట ఆడియో లీకైంది. అది టెస్ట్ వర్షనే, అసలు సింగర్స్ తో పాడించిన పాట వేరే ఉంది. కాని ఏదేమైనా లీకు లీకే.
ఈ లీకేజి డ్యామేజ్ కంట్రోల్ జరిగినా, ఇంకా డ్యామేజ్ జరక్క ముందే ఫిల్మ్ టీం మేలుకోవాలి. అంటే సాధ్యమైనంత త్వరగా లీకైన పాట అసలు వర్షన్ ని అప్ డేట్ రూపంలో రిలీజ్ చేయాలి.. లేదంటే లేటుగా ఆ పాటని వదిలినా ఆల్రెడీ లీకు వినేశాక క్యూరియాసిటీ తగ్గే ఛాన్స్ ఉంది.
అందుకే దిల్ రాజు టీం గేమ్ ఛేంజర్ సాంగ్ రిలీజ్ కి రంగం సిద్దం చేసుకుందట. వినాయక చవితి సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందట. ఈ పాటని దాదాపు సోమవారం వినాయక చవితి సందర్భంగా విడుదల చేయొచ్చని తెలుస్తోంది.