సమంతను అడ్డం పెట్టి.. N కన్వెన్షన్ కూల్చివేత ఆపారా ?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 24, 2024 | 08:46 PMLast Updated on: Aug 24, 2024 | 8:46 PM

Will Samantha Stop Demolish N Convention In Brs Government

హీరో నాగార్జునకు అత్యంత ప్రీతిపాత్రమైన ఎన్ కన్వెన్షన్‌పై హైడ్రా బాంబు పడింది. మాదాపూర్ లోని తుమ్మిడి కుంట చెరువును ఆక్రమించి FTL నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ కట్టి, పెళ్లిళ్లకు ఫంక్షన్లకు అద్దెకిచ్చుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ. 2012లో దీని నిర్మించిన నాగార్జున చాలా తెలివిగా అనుమతులు తీసుకున్నారు. బఫర్ జోన్‌ను ఆక్రమించి FTL నిబంధనలను బేకాతరు చేసి… ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ కట్టారు. ఇటీవల హైడ్రా ఏర్పడిన తర్వాత… ఈ ఎన్ కన్వెన్షన్‌పైనే పెద్దగా చర్చ జరిగింది. దానిలో భాగంగానే హైడ్రా 2వందల మంది అధికారులతో, పోలీస్ ప్రొటెక్షన్‌తో కదిలి వచ్చి… ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసింది. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి కట్టిన దీని లోని రెండు పెద్ద హాళ్లను గంటల వ్యవధిలోనే హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. మొదట కన్వెన్షన్ సెంటర్ గోడకు నోటీసులు అందించి… అత్యాధునిక మిషనరీతో, భారీ బుల్డోజర్లతో కూల్చివేతలు కొనసాగించారు. అంతేకాదు ఎన్ కన్వెన్షన్ పక్కనే , తుమ్మిడి కుంట చెరువు చుట్టూ నిర్మించిన షెడ్లు, వ్యాపార సముదాయాలను కూడా నేలమట్టం చేశారు. ఇదంతా చూస్తున్న వాళ్లకు ఆశ్చర్యం కలగక మానదు. తుమ్మిడిగుంట చెరువు చుట్టూ అక్రమంగా ఎన్ కన్వెన్షన్‌లో నిర్మించి ఉంటే గడిచిన 10ఏళ్లలో దీనిని ఎందుకు కూల్చి వేయలేదు.. 2016లో దీన్ని కూలగొట్టాలని నోటీసులు ఇచ్చి… మళ్లీ వెనక్కి ఎందుకు తీసుకున్నారు…. కేవలం కోర్టు స్టేతోనే నిజంగా ఇది ఆగిపోయిందా… దీని వెనక ఏమైనా జరిగిందా. అనే చర్చ మొదలైంది.

అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం… హీరో నాగార్జునతో లాలూచీ పడిందని.. తుమ్ముడికుంటను దారుణంగా ఆక్రమించి కట్టిన.. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయాలని పర్యావరణవేత్తలు, కొందరు అధికారులు ఎంత విజ్ఞప్తి చేసినా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అడ్డం పడ్డారనేది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ఏర్పడిన దగ్గర్నుంచి సినిమా ఇండస్ట్రీని కేటీఆర్ పూర్తిగా తన అదుపులో పెట్టుకున్నారు. ఏ సినిమా ఫంక్షన్లకైనా చీఫ్ గెస్ట్‌గా కేటీఆర్‌ని పిలవాల్సిందే. ఇక నాగార్జున కుటుంబంతో కేటీఆర్ స్నేహం అలాంటిది ఇలాంటిది కాదు. చాలా ఘాడమైనది. అంతేకాదు అప్పటికే నాగార్జున కుటుంబంలో భాగమైపోయిన హీరోయిన్ సమంతను ఏకంగా తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించేశారు కేటీఆర్. అంతేకాదు సమంతకి రెండు కోట్ల రూపాయలు జనం సొమ్ము పారితోషికంగా సమర్పించుకున్నారు. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే రేగింది. తెలంగాణలో ఆడపిల్లలే లేరా…. తెలంగాణ చేనేతకు తమిళ అమ్మాయిని తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేయాల్సిన అవసరం ఉందా … అని చాలామంది ప్రశ్నించారు కూడా. తెలంగాణ చేనేత చీర సరిగ్గా కట్టుకోవడం కూడా రాని సమంత… తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ ఏంటని కొందరు జుట్టు పీకున్నారు. అధికారం మత్తులో కేటీఆర్ అవన్నీ పట్టించుకోలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి… నిత్యం ఇదే విషయాన్ని దెప్పిపొడుస్తూ ఉండేవారు. కేటీఆర్‌ని ఉద్దేశించి… మీ నాన్న నియంత, నువ్వు సమంత అని వెక్కిరించే వారు. అసెంబ్లీలో కూడా ఎన్ కన్వెన్షన్ ప్రస్తావన వచ్చింది. దీన్ని ఎందుకు కూల్చివేయట్లేదు అంటూ రేవంత్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, కేటీఆర్‌ను సభలోనే నిలదీశారు.

2017లోనూ ఎన్ కన్వెన్షన్ కూల్చేయాలని డిమాండ్ వచ్చినప్పుడు… నాగార్జున, కేటీఆర్ మధ్య సమంత రాయబారం నడిపినట్లు చెప్తారు. తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయిన సమంత… తన స్నేహ సంబంధాలతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయకుండా అడ్డుకోగలిగారని పొలిటికల్, మూవీ ఇండస్ట్రీలో టాక్ నడిచింది. ఇది నిజమో, అబద్దమో కానీ.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ మాత్రం ఆ తర్వాత దేదీప్యమానంగా వెలిగిపోయింది. అక్రమంగా చెరువుల్ని ఆక్రమించి కట్టిన కన్వెన్షన్ సెంటర్ జోలికి ఒక్క అధికారి కూడా రాలేదు. చిన్న పలుగు దెబ్బ కూడా పడలేదు. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ని కాపాడుకోవడానికి కేసీఆర్‌ కుటుంబానికి భారీగా ముట్టచెప్పారని… అందుకే దాన్ని కూల్చి వేయకుండా వదిలేశారని ప్రచారం కూడా నడిచింది. మొత్తం మీద అప్పటి తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో… హీరోయిన్ సమంతకు ఉన్న స్నేహ సంబంధాలు… ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ని కాపాడాయి. అన్ని రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. తెలంగాణలో ప్రభుత్వం మారి… చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పడిన తర్వాత… ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై దెబ్బ పడింది. తనకు స్టే ఆర్డర్ ఉందని నాగార్జున ఎంత గింజుకున్నా… బుల్డోజర్లు, ప్రొక్లైనర్లు ఆగలేదు. గంటల్లోనే కూల్చి పడేశాయ్‌. ఆనాడు అసెంబ్లీలో తాను లేవనెత్తిన ప్రశ్నకు… ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి సమాధానం వెతికి చూపించారు. ఆ తర్వాత ఇప్పుడు హైకోర్టు మరోసారి స్టే ఇస్తే ఇచ్చి ఉండవచ్చు. కానీ హైడ్రా తను అనుకున్నది పూర్తి చేసేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు మరోసారి అడ్డం పడడానికి, నాగార్జున ఆస్తుల్ని కాపాడడానికి ప్రస్తుతం సమంత ఆ కుటుంబంతో లేదు. నాగచైతన్యతో విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. ఇది కేటీఆర్ అధికారంలోనూ లేడు. పాపం నాగర్జునా..