నాగచైతన్య నజీబ్ మార్చేది రెండో భార్యే… పాన్ ఇండియా లెవల్లో వైరల్..
నందమూరి ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా హీరోగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెండు సార్లు బాక్సాఫీస్ బెండ్ తీశాడు. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ అలానే ట్రెండ్ బెండ్ చేశాడు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి కూడా పాన్ ఇండియా గుర్తింపు ఉన్నా, పాన్ వరల్డ్ మూవీతో మహేశ్ బాబు జర్నీ మొదలు పెట్టాడు.
నందమూరి ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా హీరోగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెండు సార్లు బాక్సాఫీస్ బెండ్ తీశాడు. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ అలానే ట్రెండ్ బెండ్ చేశాడు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి కూడా పాన్ ఇండియా గుర్తింపు ఉన్నా, పాన్ వరల్డ్ మూవీతో మహేశ్ బాబు జర్నీ మొదలు పెట్టాడు. రాజమౌళి ప్రాజెక్ట్ తో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేశాడు. సో సూపర్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా హీరోలున్నారు. ఆఖరికి దగ్గుబాటి ఫ్యామిలీనుంచి రానా ప్యాన్ ఇండియా స్టార్ గా ఫోకసయ్యాడు.. ఎటొచ్చి అక్కినేని ఫ్యామిలీ నుంచే పాన్ ఇండియా వెలుగులు మొదలవ్వలేదు. ఇప్పుడా వెలుగులు నాగచైతన్య నుంచి ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.. తన ఎక్స్ వైఫ్ సమంత పాన్ ఇండియా లేడీ అయితే, చై ప్రజెంట్ వైఫ్ శోభితా ధూళి పాల్ల కూడా పాన్ ఇండియా స్టారే.. హాలీవుడ్ లో కూడా వర్క్ చేసిన ఈ లేడీ వల్ల తడేల్ హల్చల్ మారబోతోందా? పెళ్లి సింపుల్ గా అయినా రెండు సందర్భాల్లో పాన్ ఇండియా లెవల్లో చై గురించే చర్చ జరిగింది. అక్కీనేని ఫ్యామిలీ నుంచి ఇంకేదో వండర్ జరిగే అవకాశం ఉందా?
నాగచైతన్య ఎక్స్ వైఫ్ సమంత, పుష్ప ఐటమ్ సాంగ్ తోపాటు ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో పాన్ ఇండియాని షేక్ చేసింది. విచిత్రం ఏంటంటే పెళ్లి తర్వాతే తనకి పాన్ ఇండియా లెవల్లో ఫేట్ మారింది. అందులో చైతన్య కాంట్రిబ్యూషన్ ఉందనో, లేదనో చెప్పలేం… కాకపోతే, చైతన్య ఇప్పడుు రెండో పెళ్లిచేసుకోగానే, మరోసారి పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ అయ్యాడు.. అందుక్కారణం తన వైఫ్ శోభితా ధూలిపాల్లే..
హిందీ సినిమాలు, వెబ్ సీరీస్ లతో పాటు, యాడ్స్ తో నార్త్ ఇండియాలో ఫోకస్ అయిన శోభితా హాలీవుడ్ లో కూడా నటించింది. సో తన కనెక్షన్స్, తనకు నార్త్ లో ఉన్న గుర్తింపు బేస్ చేసుకుని, నాగచైతన్యకి పాన్ ఇండియా లెవల్లో ఫేట్ మారే టైం వచ్చిందంటున్నారు
తన తండ్రి నాగార్జున ఆల్రెడీ హిందీ సినిమాలు చేశాడు… గీతాంజలితో తమిల్ లో కూడా హిట్ కొట్టాడు. సో పార్టులు పార్టులుగా పాన్ ఇండియా లెవల్లో నాగ్ ప్రయాణం చేశాడు. గుర్తింపు తెచ్చుకున్నాడు కాని పాన్ ఇండియా హీరో అనిపించుకునేలా ఆరేంజ్ హిట్ పడలేదు. తనలానే మహేశ్ కి కూడా గుర్తింపు ఉంది కాని అలాంటి హిట్ రాలేదు… కాబట్టే రాజమౌలి మేకింగ్ లో పాన్ వరల్డ్ ని షేక్ చేసేపనిలో ఉన్నాడు..
ఎలాచూసినా చిరుఫ్యామిలీనుంచి చెర్రీ, నందమూరి ఫ్యామిలీ నుంచి తారక్, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా, కృష్ణం రాజు ఫ్యామిలీ నుంచి రెబల్ స్టార్ పాన్ ఇండియాని షేక్ చేశారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య తండేల్ తో దాడి చేయబోతున్నాడు. సాయి పల్లవికి పాన్ ఇండియా గుర్తింపు ఉండటం వల్ల ఈ మూవీకి తను ప్లస్ అయితే, తన భార్య శోభితా నార్త్ ఇండియా కనెక్షన్స్,, నార్త్ ఇండియా ప్రమోషన్స్ తండెల్ కి హెల్ప్ అవుతాయనే అంటున్నారు. ఆల్రెడీ హిందీ మూవీ లాల్ సింగ్ చడ్డాతో హిందీలో ఓసారి మెరిసి మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు నాగచైతన్య..
సో పాన్ ఇండియా లెవల్లో అక్కినేని ఫ్యామిలీకి బోనీ వస్తుందా అన్న చర్చ మొదలైంది. తండెల్ తో ఏదో అద్బుతం జరుగుతుందనలేం. కాని, నాగ్, శోభితా ధూలి పాల, అలానే లాల్ సింగ్ చడ్డా వల్ల వచ్చిన గుర్తింపు, సాయిపల్లవి కూడా ఇందులో నటిస్తోంది కాబట్టి తన వల్ల కూడా పాన్ ఇండియా లెవల్లో నాగచైతన్య చక్రం తిరగొచ్చనే చర్చ మొదలైంది. సూచనలు కూడా అలానే కనిపిస్తున్నాయి.