River Olympics : ఆ మురికి నదిలో అథ్లెట్లు దిగుతారా ? ఒలింపిక్స్ నిర్వాహకులకు టెన్షన్
పారిస్ ఒలింపిక్స్ కు ఇంకా కొద్ది రోజులే సమయముంది. ఇప్పటికే ఒక్కొక్క దేశానికి చెందిన క్రీడాకారులు స్పోర్ట్స్ విలేజ్ లో అడుగుపెడుతున్నారు. అయితే ఆరంభోత్సవం దగ్గరపడేకొద్దీ నిర్వాహకుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
పారిస్ ఒలింపిక్స్ కు ఇంకా కొద్ది రోజులే సమయముంది. ఇప్పటికే ఒక్కొక్క దేశానికి చెందిన క్రీడాకారులు స్పోర్ట్స్ విలేజ్ లో అడుగుపెడుతున్నారు. అయితే ఆరంభోత్సవం దగ్గరపడేకొద్దీ నిర్వాహకుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అతి సుందరదేశంగా పేరున్న తమకు ఒలింపిక్స్ నిర్వహణతో మురికికూపంగా విమర్శలు తెచ్చుకుంటామా అన్న భయం వెంటాడుతోంది. పారిస్ నగరంలో ప్రవహించే సియోన్ నదే వారి భయానికి కారణం. ఎంత బాగు చేసినా ఈ నది నీరు రంగు మారడం లేదు. సియోన్ లో వర్షపు నీరు, మురుగునీరు కలిసి పారడంతో శుభ్రం చేసినా మురికిగానే కనిపిస్తోంది. దీంతో ఈ నీటిలో ఈకోలీ బ్యాక్టీరియా తీవ్రస్థాయిలో ఉంటోంది. ఈ నదిలో ఈదడం క్రీడాకారుల ఆరోగ్యానికి ఏమాత్రం సురక్షితం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒలింపిక్స్ ప్రమాణాల ప్రకారం పోటీల కోసం ఉపయోగించే నీరు స్వచ్ఛంగా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సియోన్ నదిలో బ్యాక్టీరియా 10 రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. సియోన్ నదిలో ట్రయాథ్లాన్, మారథాన్ స్విమ్మింగ్ పోటీలు నిర్వహించాల్సి ఉండగా… ప్రస్తుతం అవి జరిగేలా కనిపించడం లేదు. అయితే ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఈ నదిని శుభ్రం చేసేందుకు 12 వేల కోట్ల రూపాయలు వెచ్చించినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వేదికల కోసం నిర్వహాకులు ప్రయత్నిస్తున్నారు.