Petrol Price: పెట్రోల్ రేట్ తగ్గబోతోందా..? ఎంత తగ్గిస్తారు..?
గ్యాస్ ధర తగ్గింది.. మరి నెక్స్ట్ ఏంటి..? ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎవరూ ఊహించని విధంగా బండ బాదుడును తగ్గించింది కేంద్రం. మరి తర్వాత స్టెప్ గా పెట్రోల్ ధరలు తగ్గిస్తుందా..? నిజంగా కేంద్రంలో ఆ ఆలోచన ఉందా..? ఉంటే పెట్రోల్ ఎంత మేర తగ్గొచ్చు..?
రానన్నదంతా ఎన్నికల కాలమే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఆ వెంటనే లోక్ సభ కాసేపు నిద్ర పట్టలేదు ఎన్నికలు.. ఈ సమయంలో కొండలా పేరుకుపోతున్న ప్రజా వ్యతిరేకతను చల్లార్చే పనిలో పడ్డారు ప్రభుత్వ పెద్దలు.. కేంద్రం త్వరలో పెట్రోల్ ధరలు తగ్గించే అవకాశాలు లేక పోలేదన్నది నిపుణుల మాట. గత ఏడాదిగా కేంద్రం పెట్రో ధరలను స్థిరంగా ఉంచింది. ప్రపంచ మార్కెట్లలో ఆయిల్ ధరలలో ఒడిదుడుకులు ఉన్నా మన దగ్గర మాత్రం ఎలాంటి మార్పు లేదు. రష్యా నుంచి అతి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినా.. ఆ లాభాన్ని మాత్రం వినియోగదారులకు అందనివ్వలేదు. కానీ ఇప్పుడు ప్రజల్లో గూడు కట్టుకున్న వ్యతిరేకతను తగ్గించేందుకు పెట్రోల్ ధరలను తగ్గించక తప్పని పరిస్థితి. త్వరలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించ వచ్చని భావిస్తున్నారు. లీటర్ పెట్రోల్, డీజిల్ పై పది రూపాయల వరకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గుతుందన్నది అంచనా.
పెట్రోల్ రేట్లు లీటర్ పై పది రూపాయలు తగ్గించడం అంటే చిన్న విషయం కాదు. ప్రభుత్వ ఆదాయంపై భారీగా ప్రభావం పడుతుంది. కానీ ఎన్నికల వేళ ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని కేంద్రం భావిస్తుంది. ఇంతకాలం పెట్రోల్ పై వచ్చిన లాభంలో కొంత భాగాన్ని వదులుకోవడానికి కేంద్రం సిద్ధపడింది.
గత కొంతకాలంగా కేంద్రాన్ని, రిజర్వ్ బ్యాంక్ ను ద్రవ్యోల్బణం కలవరపెడుతోంది. జూలైలో 15 నెలల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణన్ని కాస్త తగ్గించేందుకు చర్యలు వేగవంతం చేసింది. గ్యాస్ సిలిండర్ పై 200 రూపాయలు తగ్గించడంతో ద్రవ్యోల్బణం 30 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.. ఇటు కిలో 200 దాటి కంగారెత్తించిన టమోటా ఇప్పుడు నేలకు దిగింది. ఇది కూడా కాస్త ఊరటనిచ్చే విషయమే. దీంతో రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం డేంజర్ మార్క్ 6 కంటే తగ్గొచ్చని లెక్క కడుతున్నారు. ఇప్పుడు పెట్రోల్ రేటు తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ మరింత దిగివస్తుందని అంచనా వేస్తున్నారు.
ఎన్నికల కోణంలోనే అయినా గ్యాస్, పెట్రోల్ ఉత్పత్తుల ధరలు కొంతమేర తగ్గించడం సామాన్యుడికి ఊరట ఇచ్చేదే.. కనీసం ఎన్నికలవరకైనా కాస్త భారం తగ్గి సగటు మానవుడు ఊపిరి పీల్చుకోవచ్చు..