మళ్ళీ త్యాగం తప్పదా ? మిడిలార్డర్ లోనే రోహిత్ శర్మ

భారత్, ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎప్పటిలానే నువ్వానేనా అన్నట్టు సాగుతోంది. గత రెండు పర్యటనల్లోనూ కంగారూలకు షాచ్చిన టీమిండియా ఈ సారి తొలి టెస్టులో ఘనవిజయం సాధించి అదరగొట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2024 | 09:23 PMLast Updated on: Dec 20, 2024 | 9:23 PM

Will There Be Another Sacrifice Rohit Sharma In The Middle Order

భారత్, ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎప్పటిలానే నువ్వానేనా అన్నట్టు సాగుతోంది. గత రెండు పర్యటనల్లోనూ కంగారూలకు షాచ్చిన టీమిండియా ఈ సారి తొలి టెస్టులో ఘనవిజయం సాధించి అదరగొట్టింది. కానీ రెండో టెస్టులో చేతులెత్తేయడంతో సిరీస్ సమమైంది. ఇక వర్షం దెబ్బకు మూడో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ బాక్సింగ్ డే టెస్టుపైన పడింది. డిసెంబర్ 26 నుంచి మెల్ బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ మొదలు కాబోతోంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓపెనర్‌ ఎవరనే దానిపై మళ్ళీ చర్చ మొదలైంది. గత 3 మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా రాణించారు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రాహుల్, యశస్వి కలిసి 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు.

దీంతో రెండో టెస్టులో రోహిత్ శర్మ తిరిగి వచ్చినప్పటికీ 6వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఫామ్ లో ఉన్న రాహుల్, జైశ్వాల్ జోడీని విడదీయొద్దన్న కారణంతోనే రోహిత్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగాడు. అయితే రెండో టెస్టులో రాహుల్, యశస్వి జోడీ శుభారంభం ఇవ్వలేకపోయినా.. మూడో టెస్టులో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ భారత్‌కు భారీ ఇన్నింగ్స్ ఆడాడు.దీంతో మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగే నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో కూడా రాహులే ఓపెనర్ గా రానున్నాడు. దీంతో రోహిత్ తన స్థానాన్ని మళ్ళీ త్యాగం చేయక తప్పేలా లేదు. నిజానికి హిట్ మ్యాన్ కెరీర్ మిడిలార్డర్ లోనే ప్రారంభమైంది. తర్వాత ఓపెనర్ గా అద్భుతంగా రాణించి జట్టుకు ఎన్నో విజయాలనందించాడు. ఇప్పుడు జట్టు ప్రయోజనాల కోసం మరోసారి మిడిలార్డర్ కు మారాడు.

ఇదిలా ఉంటే నాలుగో టెస్ట్ కోసం ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ లో ఆధిక్యం సాధించడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులోనూ ముందంజ వేస్తుంది. దీంతో రెండు జట్లూ తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగనున్నాయి. ఈ సిరీస్ లో భారత బౌలింగ్ ఆకట్టుకుంటున్నా… బ్యాటింగ్ మాత్రం నిరాశపరుస్తోంది. కీలక బ్యాటర్లు ఎవ్వరూ నిలకడగా రాణించడం లేదు. గిల్, కోహ్లీ, రోహ్లీ, పంత్ ఇప్పటి వరకూ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. దీంతో బాక్సింగ్ టెస్టులో బ్యాటర్లు రాణిస్తే తప్ప విజయంపై ఆశలు పెట్టుకోలేం.