BRS Party : ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ ఇక ఉండదా ?
పార్లమెంట్ రిజల్ట్ (Parliament Result) తరువాత ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఉండదా ? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. ఇప్పుడు మంచి ఆఫర్ చూసుకుని వెళ్లిపోవడం బెటరా ?
పార్లమెంట్ రిజల్ట్ (Parliament Result) తరువాత ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఉండదా ? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. ఇప్పుడు మంచి ఆఫర్ చూసుకుని వెళ్లిపోవడం బెటరా ?
పార్టీ సంగతి పక్కన పెడితే తనను తాను కాపాడుకే పరిస్థితిలో కూడా కేసీఆర్ లేరా ? గులాబీ దళంలో ఇప్పుడు వినిపిస్తున్న గుసగుసలు ఇవే. ఓ పక్క కాంగ్రెస్ దాడి మరో పక్క వరుసగా వచ్చి పడుతున్న కేసులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. నిజానికి తెలంగాణలో అధికారం కోల్పోయినప్పుడే బీఆర్ఎస్ పార్టీ చాలా వీక్ అయ్యింది. వరుసగా పార్టీ నేతలు వెళ్లిపోవడంతో చాలా మంది కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది. ఇక ఇప్పుడు వరుసగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam) లు బీఆర్ఎస్ (BRS) లో కొత్త భయాన్ని పుట్టించాయి. పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) తరువాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటూ చాలా మంది కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఈ ఎన్నికల తరువాత బీఆర్ఎస్‌లోని చాలా మంది నేతలు పార్టీ మారతారని.. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ భూ స్థాపితం అవుతుందని చెప్పారు.
ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు వాళ్ల మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సంగతి పక్కన పెడితే ఈ ఎన్నికల తరువాత పార్టీని నిలుపుకోడానికే కేసీఆర్ చాలా కష్టపడుతున్నారు. అందుకే ప్రతీ మీటింగ్‌లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోదని.. బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ రాష్ట్రాన్ని పాలిస్తుందని చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ వచ్చి పడిన కేసులు పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping), ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ పాత్రను నేరుగానే బయటపెట్టేశారు పోలీసులు. ఇప్పుడు రెండు కేసుల్లో నేరం రుజువైతే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం. ఒకవేళ అదే నిజమైతే నిజంగానే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ పడ్డట్టే. ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా గ్రౌండ్‌తో దిగారు కాబట్టే పార్టీలో ఆమాత్రం ఐనా జోష్ వచ్చింది అనేది అంతా చెప్తున్న మాట.
ఇప్పుడు అదే కేసీఆర్ (KCR) జైలుకు వెళ్తే ఇక పార్టీ నిలబడటం చాలా కష్టం. ఈ కేసులను సాల్వ్ చేసుకునే క్రమంలో పాలిటిక్స్ మీద బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టలేదు. ఈ గ్యాప్‌లో పార్టీ లీడర్లు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) లకు వెళ్లిపోతే ఇక తెలంగాణలో బీఆర్ఎస్ భూస్తాపితం అవుతుందంటున్నారు విశ్లేషకులు. మరి ఈ కేసుల్లో తరువాత ఏం జరగబోతోంది. పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలంటే.. ఎలక్షన్ రిజల్ట్ వరకూ ఆగాల్సిందే.