Jyotiraditya Scindia: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతారా..?
కేంద్రమంత్రిగా కొనసాగుతున్న మధ్యప్రదేశ్ కీలక నాయకుడు రానున్న రోజుల్లో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలువనున్నారా.

Will Union Minister Jyotiraditya Scindia contest the upcoming assembly elections and become the Chief Minister
2023-24 ఎన్నికల వేడి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో కూడా అగ్గిరాజేస్తోంది. అటు మధ్య ప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బరిలో దిగే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇదే ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం జ్యోతిరాదిత్య సింధియా మేనత్త యశోధరా పేరు లేకపోవడం గమనార్హం. దీని అర్థం ఈ సారి ఆ స్థానంలో తన మేనల్లుడు ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోగిరాదిత్య సింధియా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా గనుక జరిగితే జ్యోతిరాధిత్య సింధియా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది.
దీనికి కారణం ఏంటి..
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రధ్య ప్రదేశ్ కీలకం కానుంది. కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే కేంద్ర మంత్రులు, ఎంపీలు, స్థానికంగా ఉన్న కీలక నాయకులు భావించారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి అని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే కీలక నేతగా ఉన్న యశోధరా రాజే రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తెలిపారు. దీనికి కారణాలు కూడా వెల్లడించారు. ఇప్పటికే నాలుగు సార్లు కరోనా బారిన పడ్డట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఎన్నికల బరిలో నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టంచేశారు. దీనిని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ ధ్రువీకరించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాంతం నుంచే పోటీ
యశోధరా రాజే 2013 నుంచి ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం అయితే క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో తాను శివపురి నుంచి పోటీ చేయనను నాలుగు నెలల క్రితమే కేంద్రానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఈమె మేనల్లుడు జ్యోతిరాధిత్య సింధియా కొనసాగుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుణ, బమోరి, శివపురి ఈ మూడింటి నుంచి శాసన సభ్యునిగా పోటీ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గతంలో సింధియా ఎంపీగా పోటీ చేసిన నియోజకవర్గాలు కావడంతో ఇక్కడ బలం ఉంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఇంకా కేటాయించకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది.
సింధియా రాజకీయ ప్రస్థానం ఇలా..
జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావ్ సింధియా 2001లో మరణించారు. ఈ తరువాత కొడుకు తన తండ్రి అడుగుజాడల్లో నడిచేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా మాధవరావ్ సింధియా ప్రాతినిథ్యం వహించిన గుణ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి గెలిచారు. అప్పటి నుంచి 2019 వరకూ తిరుగులేని నేతగా ఎదిగారు. 2019లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. ఆతరువాత కాంగ్రెస్ కి తిలోదకాలు ఇచ్చి కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభ కోటాలో ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. రానున్న అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడి గెలిచి అసెంబ్లీలో కొనసాగుతారని జోరుగా చర్చించుకుంటున్నారు కొందరు నేతలు.
T.V.SRIKAR