IPL 2025, Chennai Super Kings : ఆటగాడిగా మళ్ళీ చూస్తామా ? బీసీసీఐ చేతిలో ధోనీ ఫ్యూచర్
ఐపీఎల్ 2025 (IPL 2025) లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) ఆడతాడా లేదా అనే విషయంపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

dhoni
ఐపీఎల్ 2025 (IPL 2025) లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) ఆడతాడా లేదా అనే విషయంపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. బీసీసీఐ (BCCI) , ఐపీఎల్ ఫ్రాంచైజీల (IPL Franchise) మధ్య జరగనున్న సమావేశం ధోనీ ఐపీఎల్ (IPL) భవితవ్యం ఆధారపడి ఉంది. బీసీసీఐ 5 లేదా 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఇస్తే ధోనీ వచ్చే ఐపీఎల్ ఆడతాడు. ఒకవేళ ఎప్పటిలాగే నలుగురిని మాత్రమే తీసుకునే రూల్ కొనసాగితే మాత్రం ధోనీ 2025 ఐపీఎల్ ఆడకపోవచ్చు.
బీసీసీఐ 5 లేదా 6 గురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి ఆసక్తిగా లేనట్టు సమాచారం.. చెన్నై ఫ్రాంచైజీ రుతురాజ్ గైక్వాడ్ (Ruthuraj Gaikwad), రవీంద్ర జడేజా (Ravindra Jadeja), మతీషా పతిరన, శివమ్ దూబేలను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఆ నలుగురితో పాటు తమ లెజెండ్ ధోనీని కూడా రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావిస్తోంది. ఒకవేళ ధోనీ ఆటగాడిగా చెన్నై జట్టు రిటైన్ చేసుకోకపోతే అతను తన జట్టుకు మెంటార్ గా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2008 నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనే కొనసాగిన ధోనీ ఆ జట్టును 5 సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. ఇప్పటికే కెప్టెన్సీకి గుడ్ చెప్పిన మహీ.. 2025 ఐపీఎల్ ఆడట్లేదని హింట్ ఇచ్చేశాడు. గత సీజన్ లో మోకాలి గాయంతోనే ఆడిన ధోనీ మళ్ళీ మైదానంలోకి దిగడంపై సస్పెన్స్ నెలకొంది.