ఫిట్ గా ఉన్నా.. ఇంకా ఆడతా విండీస్ వీరుడి కామెంట్స్
అంతర్జాతీయ క్రికెట్ లో మరో రెండేళ్ళ పాటు ఆడే సత్తా తనకుందన్నాడు విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్... మునుపటి కంటే ఇప్పుడే మరింత ఫిట్‌గా ఉన్నానని.. 2026 టీ20 ప్రపంచకప్ లోనూ తనను చూస్తారని చెప్పాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో మరో రెండేళ్ళ పాటు ఆడే సత్తా తనకుందన్నాడు విండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్… మునుపటి కంటే ఇప్పుడే మరింత ఫిట్‌గా ఉన్నానని.. 2026 టీ20 ప్రపంచకప్ లోనూ తనను చూస్తారని చెప్పాడు. తమ కోచ్ డారెన్ సామీ తనను మరికొన్నాళ్లపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాల్సిందిగా కోరాడని.. అలాంటపుడు తానెలా జట్టుకు దూరమవుతానని ప్రశ్నించాడు. 2010లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన రసెల్.. టీ20 స్పెషలిస్టుగా గుర్తింపు పొందాడు. జాతీయ జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ ట్వంటీ లీగ్స్ లో హార్డ్ హిట్టర్ గా దుమ్మురేపుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 82 టీ20లు ఆడిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. 60 వికెట్లు తీయడంతో పాటు 1033 పరుగులు చేశాడు.