Wine Shops Closed: మందుబాబులకు అలర్ట్.. ఆ రోజు వైన్స్ బంద్..

ట్విన్ సిటీస్‌లోని అన్ని వైన్ షాపుల్ని బుధవారం పూర్తిస్థాయిలో మూసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఏప్రిల్ 17, బుధవారం ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2024 | 08:36 PMLast Updated on: Apr 15, 2024 | 8:36 PM

Wine Shops Should Be Closed In Hyderabad On Sri Rama Navami

Wine Shops Closed: హైదరాబాద్ జంట నగరాల్లోని మందుబాబులకు అలర్ట్. శ్రీరామ నవమి సందర్భంగా, బుధవారం.. ఏప్రిల్ 17న వైన్ షాపులు మూసివేయనున్నారు. ట్విన్ సిటీస్‌లోని అన్ని వైన్ షాపుల్ని బుధవారం పూర్తిస్థాయిలో మూసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఏప్రిల్ 17, బుధవారం ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తారు.

Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్ విచారణ వాయిదా

వైన్స్‌తోపాటు కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు 24 గంటలపాటు బంద్ చేయాలని సీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని అన్ని వైన్స్, మద్యం సంబంధిత వ్యాపారులు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాల్సిందే. జంట నగరాల్లో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని సీపీ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వైన్ షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీరామ నవమి సందర్భంగా పలు ర్యాలీలు, ఉత్సవాలు జరుగుతాయనే సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం వైన్ షాపులు బంద్ అని తెలియడంతో మందుబాబులు షాపులకు క్యూ కడుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌ పరిధిలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.