HYDERABAD WINES: మందుబాబులకు అలర్ట్.. ఆ రోజు వైన్స్ బంద్..!

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 23న, జంట నగరాల పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు పూర్తి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు జారీ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2024 | 08:29 PMLast Updated on: Apr 21, 2024 | 8:29 PM

Wines Closed In Hyderabad On Hanuman Jayanthi On 23rd April

HYDERABAD WINES: హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని మందుబాబులకు అలర్ట్. ఈ నెల 23, మంగళవారం నాడు జంట నగరాల పరిధిలో మద్యం షాపులు మూసి ఉండనున్నాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 23న, జంట నగరాల పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు పూర్తి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు జారీ చేసింది.

MEGASTAR CHIRANJEEVI: ఏపీ ప్రచారంలో మెగాస్టార్.. ఇక మామూలుగా ఉండదు..

నగరంలో హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకొంటారు. ఈ రోజు హనుమాన్ శోభాయాత్ర కూడా జరుగుతుంది. నగరంలోని పలు వీధుల్లో హనుమాన్ భక్తులు ర్యాలీ నిర్వహిస్తారు. వేలాదిమంది దీనికి హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో మద్యం షాపుల్ని పూర్తిగా మూసివేస్తారు. మంగళవారం ఎక్కడా మద్యం అమ్మకాలు జరగకూడదు. బుధవారం నుంచి యథావిధిగా మద్యం అమ్ముకోవచ్చు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలో శాంతి భద్రతల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

గత వారం శ్రీరామ నవమి సందర్భంగా నగరంలో మద్యం షాపుల్ని మూసి వేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 21, ఆదివారం నాడు మహావీర్ జయంతిని పురస్కరించుకుని జంట నగరాల పరిధిలో మాంసం విక్రయాల్ని కూడా నిషేధించారు. అన్ని మతాల్ని గౌరవిస్తూ, అందరి పండుగల సందర్భంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటూ వస్తోంది.