Tillu2: మళ్ళీ వాయిదా పడిన టిల్లూ స్క్వేర్..
డీజే టిల్లూ హిట్ అవ్వడంతో టిల్లూ స్క్వేర్ కూడా హిట్ అవుతుందని అంచనాలు ఎక్కువ ఉన్నాయి.

With DJ Tilloo becoming a hit, Tilloo Square is showing more hype
ప్రస్తుతం తెలుగులో పోస్ట్ పోన్ సీజన్ నడుస్తోంది. సలార్‌తో ఇది మొదలుకాగా.. యంగ్ హీరోలు కంటిన్యూ చేస్తున్నారు. స్కందతో పాటు.. వాయిదాపడిన మరో యంగ్ హీరో మూవీ సలార్ కంటే ముందే టిల్లు స్క్వైర్ వాయిదాపడింది. కాకపోతే బైటకు చెప్పలేదు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా అంటూ.. సెప్టెంబర్ 15న వస్తామన్నారు. ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు..లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్‌లో ఆలస్యమైనా బెస్ట్ అవుట్ పుట్ ఇస్తామంటూ సారీ ప్పింది. వాయిదా పడిందన్నది ఈ ప్రెస్‌నోట్ సారాంశం.
డిజె టిల్లు హిట్ కావడంతో.. టిల్లు స్క్వైర్‌పై అంచనాలు భారీగా వున్నాయి. దీనికి తగ్గట్టే.. సాంగ్ ఆకట్టుకోవడంతో.. సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేశారు. అదిగో ఇదిగో అంటూ సినిమా మొదలుకావడమే ఆలస్యమైంది. రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడింది. సెప్టెంబర్ 15న స్కంద, టిల్లు పోటీపడతారనుకుంటే. . రెండూ వాయిదాపడ్డాయి. స్కందను సలార్‌డేట్ 28న రిలీజ్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 15న రావాల్సిన స్కంద, టిల్లు స్క్వైర్ వాయిదాపడడంతో.. డబ్బింగ్ మూవీస్ పంట పండింది. ఇదే రోజు వస్తున్న చంద్రముఖి2.. విశాల్ ‘మార్క్ ఆంటోని’కి పోటీ లేకుండా పోయింది. 28 వరకు క్రేజీ మూవీస్ లేకపోవడంతో.. మంచి వసూళ్లు రాబట్టడానికి ఛాన్స్ దొరికింది. డిజే టిల్లూ హిట్ అయింది కనుక టిల్లూ స్క్వేర్ పై ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దీనితో మూవీ కి ఎక్కువ హైప్ చేస్తున్నట్లున్నారు.