Mynampalli: మైనంపల్లి చేరికతో కాంగ్రెస్‌లో మంటలు.. మల్కాజ్‌గిరి, మెదక్ జిల్లాలో సీన్‌ రివర్స్‌..

మెదక్ సొంత జిల్లా కావడం, మెదక్‌తో పాటు నరసాపూర్ నియోజకవర్గంలో బలం ఉండడంతో.. హరీష్‌ టార్గెట్‌గా వ్యూహాలు సిద్ధం చేయాలని మైనంపల్లి భావిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 1, 2023 | 02:04 PMLast Updated on: Oct 01, 2023 | 2:04 PM

With Mainampallys Entry The Congress Is On Fire The Scene Is Reversed In Malkajgiri And Medak District

తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వలేదన్న కోపంతో.. కారు పార్టీకి గుడ్‌బై చెప్పిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మెదక్ సొంత జిల్లా కావడం, మెదక్‌తో పాటు నరసాపూర్ నియోజకవర్గంలో బలం ఉండడంతో.. హరీష్‌ టార్గెట్‌గా వ్యూహాలు సిద్ధం చేయాలని మైనంపల్లి భావిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మెదక్ జిల్లా బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నారు. ఇక గేమ్ స్టార్ట్ అనుకుంటున్న సమయంలో.. కాంగ్రెస్ కథా చిత్రమ్‌లో అనుకోని మలుపులు తిరుగుతున్నాయ్. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కొడుకు రోహిత్ చేరిక.. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది.

కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మైనంపల్లి చేసిన ప్రకటనే ఇందుకు కారణం అవుతుంందనే చర్చ జరుగుతోంది. మల్కాజిగిరి టికెట్‌ తనకే వస్తుందని మైనంపల్లి హన్మంతరావుతోపాటు ఆయన అనుచరులు బహిరంగంగా ప్రకటించడంతో.. హస్తం పార్టీలో ఒక్కసారిగా లొల్లి మొదలైంది. ఇన్నాళ్లూ పార్టీకోసం కష్టపడి పనిచేసిన తనకు టిక్కెట్‌ ఇవ్వకుండా మైనంపల్లికి టికెట్ ఎలా ఇస్తారని మల్కాజ్‌గిరి కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తానే పోటీలో తానే పోటీలో ఉంటానని ప్రకటించారు. అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. టిక్కెట్ ఇవ్వకపోతే తడఖా చూపిస్తానని సవాల్‌ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, అంజనీ కుమార్‌ యాదవ్‌… మైనంపల్లి నివాసానికి వెళ్లినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక అటు హన్మంతరావు చేరిక ఎపిసోడ్‌ అటు మెదక్‌లోనూ చిచ్చు పెట్టింది. మైనంపల్లి కుమారుడు రోహిత్‌కు టిక్కెట్‌ కన్ఫామ్‌ అనే వార్తలు రావడంతో.. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అధిష్ఠానంపై సీరియస్‌ అయ్యారు. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే ఇదేనా మీరిచ్చే గుర్తింపు అంటూ ఏకంగా కాంగ్రెస్‌కే రాజీనామా చేశారు. డబ్బు సంచులే ప్రాతిపదికగా జరుగుతున్న టికెట్ల కేటాయింపు.. ఆరోపణలతో మనోవేదనకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ వ్యతిరేకులకు నాయకత్వం అప్పగించారని మండిపడ్డారు. నోట్ల కట్టలను నమ్ముకునే వారు నడిబజారులో నవ్వులపాలు అవ్వడం ఖాయమన్నారు. ఈ మేరకు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి లేఖ విడుదల చేశారు. ప్రజాబలం ప్రాతిపదికన కాకుండా కేవలం ధన బలానికే ప్రాధాన్యత ఇస్తున్నారని.. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడితోపాటు.. సోనియా, రాహుల్ మౌనం వహించడం బాధ కలిగిస్తోందని.. ఈ సమయంలో పార్టీని వీడటం తప్ప మరో మార్గం లేదని లేదని లేఖలో తెలిపారు తిరుపతి రెడ్డి.