అయిపోయాడనుకున్న వాడు మళ్లీ స్టార్ అయ్యాడు
ఒకే ఒక్క సినిమా హీరో కెరీర్ ని ఛేంజ్ చేస్తుంది.బ్లాక్ బస్టర్ అయితే బడా నిర్మాతలు క్యూ కట్టేలా చేస్తుంది.ఇలాంటి ఫేజ్ లోనే ఎంజాయ్ చేస్తున్న సన్నీ డియోల్ కి ఇప్పుడు మరో జాక్ పాట్ తగిలింది.

With the opportunity of an OTT film, Sunny Doll is going to continue her stardom again
ఒక్క సినిమా..ఒకే ఒక్క సినిమా హీరో కెరీర్ ని ఛేంజ్ చేస్తుంది.బ్లాక్ బస్టర్ అయితే బడా నిర్మాతలు క్యూ కట్టేలా చేస్తుంది.ఇలాంటి ఫేజ్ లోనే ఎంజాయ్ చేస్తున్న సన్నీ డియోల్ కి ఇప్పుడు మరో జాక్ పాట్ తగిలింది. అమీర్ నిర్మించే ప్రాజెక్ట్ కి భారీ ఓటీటీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
సన్నీ డియోల్..బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరో.కానీ గత దశాబ్ద కాలం నుంచి తన సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో సన్నీ గురించి పెద్దగా మాట్లాడం మానేశారు బీటౌన్ క్రిటిక్స్. అయితే రీసెంట్ గా వచ్చిన గదర్ 2 ఈ పరిస్థితి మొత్తన్ని మార్చేసింది. గతంలో సన్ని తో సినిమా అంటే భయపడిన దర్శక, నిర్మాతలు ఇప్పుడు క్యూ కడుతున్నారు. అడ్వాన్సులు ఇచ్చేందుకు సై అంటున్నారు. దీంతో ఒకేసారి 5 సినిమాలకు కమిట్ అయ్యాడు సన్నీ డియోల్.అయితే ఇందులో రాజ్ కుమార్ సంతోషి తెరకెక్కించనున్న మూవీ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతోంది.
సన్నీ డియోల్, రాజ్ కుమార్ సంతోషి కాంబోలో ఇప్పటి వరకు 3సినిమాలు వచ్చాయి. అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. 1996 తర్వాత మళ్ళీ ఈ కాంబో సాధ్యపడలేదు.. ఏవో విబేధాల వల్ల తిరిగి కలుసుకునే ప్రయత్నాలు చేయలేదు. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబోని సెట్ చేశాడు అమీర్ ఖాన్. అస్గర్ వజాహట్ రాసిన నవల ఆధారంగా ఓ ప్రాజెక్ట్ ని వీళ్లతో నిర్మించబోతున్నాడు. 1947 ఇండియా పాకిస్థాన్ విభజన టైంలో లక్నో నుంచి లాహోర్ వెళ్లిన శరణార్ధుల విషాద పరిణామాల చుట్టూ ఈ సినిమా కథ తీరగనుంది. సన్నీ డియోల్ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిన వెంటనే 95 కోట్ల ఓటిటి డీల్ ఆఫర్ ని ఇచ్చిందట జీ5. ఇంత కంటే మంచి రేట్ వస్తుందనే ఉద్దేశంతో అమీర్ ఖాన్ ఇంకా ఎస్ చెప్పలేదట. వచ్చే జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. సౌత్ లో కమల్ , రజనీకాంత్ లు అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చినట్టు నార్త్ లో సన్నీ డియోల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. మరి ఈ సినిమాతో తన స్టార్ డమ్ ని ఎంత వరకు కంటిన్యూ చేస్తాడో చూడాలి.