Prasanth Varma : ప్రశాంత్ వర్మ సంచలన నిర్ణయం
హనుమాన్' (Hanuman) సంచలన విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆయన తదుపరి చిత్రం పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

With the sensational success of Hanuman, the name of director Prashant Varma became popular all over the country.
హనుమాన్’ (Hanuman) సంచలన విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆయన తదుపరి చిత్రం పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిజానికి ‘హనుమాన్’ విడుదలకు ముందు ‘అధీర’ (Adhira) అనే సినిమాని ప్రకటించాడు ప్రశాంత్. ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం కానున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి ప్రశాంత్ తప్పుకోబోతున్నాడట.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూపర్ హీరో ఫిల్మ్ గా ‘హనుమాన్’ వచ్చింది. ‘అధీర’ కూడా సూపర్ హీరో ఫిల్మ్ నే. అయితే ‘హనుమాన్’ ఊహించిన దానికంటే భారీ విజయం సాధించడంతో.. దానికి సీక్వెల్ గా ప్రకటించిన ‘జై హనుమాన్’ ని ముందుగా పూర్తి చేయాలని ప్రశాంత్ భావిస్తున్నాడట.
దాని ప్రభావం ‘అధీర’పై పడనుంది. ‘జై హనుమాన్’ (Jai Hanuman) తో పాటు వేరే భారీ ఆఫర్లు కూడా ప్రశాంత్ కి వస్తున్నాయట. వీటి కారణంగా ‘అధీర’ ఆలస్యమవుతుంది. అందుకే ఆ మూవీ దర్శకత్వ బాధ్యతను వేరొకరికి అప్పగించాలని ప్రశాంత్ వర్మ నిర్ణయించుకున్నాడట. దీని కోసం ‘నా సామి రంగ’ ఫేమ్ విజయ్ బిన్నీని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ప్రశాంత్ రచనలో వస్తున్న ఈ సూపర్ హీరో ఫిల్మ్ ని విజయ్ బిన్నీ ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.