Badrinath : బద్రీనాథ్ దర్శనం లేకుండానే.. భక్తులు వెనక్కి.. ఎందుకో తెలుసా..?
ఉత్తరాదిలోని ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో ఉన్న నాలుగు పుణ్యక్షేత్రాల యాత్ర.. ప్రతి సంవత్సరం 6 నెలలు మాత్రమే తెరచి ఉండే ఈ ఆలయాల యాత్రను చోట ఛార్ ధామ్ యాత్ర (Char Dam Yatra) అని అంటారు.
ఉత్తరాదిలోని ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో ఉన్న నాలుగు పుణ్యక్షేత్రాల యాత్ర.. ప్రతి సంవత్సరం 6 నెలలు మాత్రమే తెరచి ఉండే ఈ ఆలయాల యాత్రను చోట ఛార్ ధామ్ యాత్ర (Char Dam Yatra) అని అంటారు. దక్షిణాదిలో ఆలయలకన్న ఈ ఆలయ దర్శనాలు కొంచెం భిన్నంగానే ఉంటాయి. అంటే ఈ యాత్రకు వెళ్లాలంటే ముందుగా దర్శనం కు సంబంధించిన రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించాలి.. అలా పాటించకుండా వెళితే ఆలయ దర్శనం కాదు కదా.. ఆలయ ప్రాంగణంలోకి కూడా అడుగు పెట్టలేరు.
ఇక విషయంలోకి వెళితే..
యమునోత్రి (Gangotri), గంగోత్రి, కేదార్ నాథ్ (Kedarnath), బద్రినాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను కలిపే చోట ఛార్ ధామ్ యాత్ర అని అంటారు. తాజాగా బధ్రినాథ్ వెళ్లిన భక్తులకు బిగ్ షాక్ తగిలింది. ఛార్ ధామ్ యాత్ర చేయ్యలంటే ముందుగా ఉత్తరాఖండ్ యాత్ర పాస్ తీసుకోవాలి ఆ పాస్ తీసుకోవలంటే ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర అనే సైట్ లో రిజిస్ట్రేషన్ తన పేరును రిజిస్టేషన్ చేసుకోవాలి. అప్పుడు అధికారికంగా ఛార్ ధామ్ యాత్రను చేసుకోవడానికి అన్ని అనుమతులు తీసుకున్నట్లు ఓ PDH వస్తుంది. కానీ ఈ పద్దతిని కొంత మంది అత్యుస్హాహంతో ఏలాంటి యాత్ర పాస్ తీసుకోకుండా నేరుగా బండేసుకోని బద్రినాథ్ ఘాట్ రోడ్లపై.. అక్కడి అందాలు చూసుకుంటు వెళ్లారు. తీరా బద్రీనాథ్ వెళ్లే ఓ దారిలో భారత ఆర్మీ (BRO) Border Roads Organisation సిబ్బంది.. గౌచార్ చెకోపోస్ట్ వద్ద ప్రతి వ్యక్తి యోక్క యాత్ర పాస్ చేకింగ్ చేస్తుండగా.. అక్కడ యాత్రికులు దొరికి పోయారు. ఎందుకంటారా.. బద్రినాథ్ యాత్రకు సంబంధించి వారు ఎలాంటి రిజిస్ట్రేషన్ ( యాత్ర పాస్ ) తీసుకోలేదు. దీంతో BRO సిబ్బంది వారిని గౌచార్ చెకోపోస్ట్ నుంచి వెనక్కి పంపించేశారు. ఇలా ఒక్కరా.. ఇద్దరా దాదాపు 650 మందికి పైగా రిజిస్ట్రేషన్ లేకుండా యాత్రకు వచ్చారు. సుమారుగా 126 వాహనాలను భారత ఆర్మీ బద్రినాథ్ కు అనుమతించ కుండా వెనక్కి పంపించింది.
పేర్లు నమోదు చేసుకోకుండా చార్ ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులు దర్శనానికి అనుమతించకుండా అధికారులు వెనక్కు పంపించారు. తప్పనిసరి రిజిస్ట్రేషన్ నిబంధనను పాటించకుండా 650 మందికి పైగా భక్తులు బద్రీనాథ్ వెళుతుండగా.. గౌచార్ చెకోపోస్ట్ నుంచే వారిని వెనక్కు పంపించినట్లు చమోలీ ఎస్ఎస్ పీ కార్యాలయం మంగళవారం తెలిపింది. యాత్ర ప్రారంభ రోజుల్లో నెలకొన్న గందర గోళం దృష్ట్యా రద్దీని నియంత్రించడానికి చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నేరుగా ఉత్తరఖండ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఎవ్వరు కూడా పేర్లు నమోదు చేసుకోకుండా యాత్రకు రావొద్దని, రిజిస్ట్రేషన్లో తమకు కేటాయించిన తేదీల్లో మాత్రమే భక్తులు రావాలని ఉత్తరాఖండ్ సీఎస్, డీజీపీ విజ్ఞప్తి చేశారు.