మహిళా ఎమ్మెల్యే భర్త ఇష్యూ… చంద్రబాబు సంచలన కామెంట్స్…!
ఆంధ్రప్రదేశ్ లో కొందరు ఎమ్మెల్యేల వైఖరి కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భర్తపై భూముల వ్యవహారంలో విమర్శలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ లో కొందరు ఎమ్మెల్యేల వైఖరి కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భర్తపై భూముల వ్యవహారంలో విమర్శలు వచ్చాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపి క్యాబినెట్ లో మంత్రులతో సిఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల, ప్రవర్తన కారణం ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని అసహనం వ్యక్తం చేసారు.
పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తవిస్తూ వార్తలు వస్తున్నాయి. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి.. మీ జిల్లాలోని ఎమ్మెల్యేలు నాయకులను మీరే గైడ్ చేయాలి అని సూచించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన భాద్యత మంత్రులది, ఎమ్మెల్యేలది అని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వం లో కీలక మైన సమాచారం బయటకు పోతోందని శ్వేత పత్రాల్లో సమాచారం ఓటాన్ అకౌంట్ వివరాలు , ఇతర కీలకమైన నిర్ణయాలు బయటకు పొక్కడం పై విస్మయం వ్యక్తం చేసారు చంద్రబాబు. ప్రభుత్వ శాఖల్లో వైసిపి వేగులు ఉన్నారన్న అంశం విస్తృతం గా చర్చ జరిగింది సమావేశంలో. ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన ముఖ్యమని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు.