YCP 2024 elections : ముగ్గురి మీద మహిళలే పోటీ.. జగన్ ఏం చెప్పాలనుకుంటున్నారు..
2024 ఎన్నికల్లో (2024 Elections) వైసీపీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అయింది. మొత్తం 175 అసెంబ్లీ, 24 ఎంపీ సీట్లకు అభ్యర్థుల జాబితా విడుదల చేశారు జగన్. సామాజిక వర్గాల సమీకరణాలకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్ (YS Jagan) అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళానేతలకు పెద్దపీట వేశారు.

Women are competing against the three.. What does Jagan want to say..
2024 ఎన్నికల్లో (2024 Elections) వైసీపీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అయింది. మొత్తం 175 అసెంబ్లీ, 24 ఎంపీ సీట్లకు అభ్యర్థుల జాబితా విడుదల చేశారు జగన్. సామాజిక వర్గాల సమీకరణాలకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్ (YS Jagan) అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళానేతలకు పెద్దపీట వేశారు. ఐతే జగన్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2024 ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమిగా బరిలోకి దిగుతుండగా.. కూటమి తరుఫున కీలక నేతలు బరిలో ఉంటున్నారు. టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ, లోకేష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఐతే ఈ ముగ్గురు నేతలపై మహిళలనే బరిలో నిలుపుతున్నారు జగన్. నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి దీపికను అభ్యర్థిగా ప్రకటించారు.
జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం (Pithapuram) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంగా గీతను బరిలో దించారు. నారా లోకేష్‌కు పోటీగా మంగళగిరిలో లావణ్యను బరిలో నిలిపారు. మొత్తం 19 మంది మహిళలకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించిన జగన్.. కీలక నేతలపై మహిళా అభ్యర్థులను బరిలో నిలపడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ నిర్ణయంపై.. సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతోంది. హిందూపురంలో ఇప్పటివరకు మహిళా అభ్యర్థులెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ పార్టీ కూడా మహిళా నేతను బరిలో నిలపలేదు. పిఠాపురంలో పవన్‌కు పోటీగా వంగాగీతను బరిలో దింపడం వెనక భారీ వ్యూహమే కనిపిస్తోంది.
పవన్ మీదకు కాపు నేతను.. అందులోనూ మహిళను బరిలోకి దింపితే.. కాపు సామాజికవర్గం ఓట్లతో పాటుగా .. మహిళల ఓట్లు కలిసి వస్తాయని వైసీపీ (YCP) ఆలోచన. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి (Mangalagiri) నియోజకవర్గం నుంచి లావణ్యను వైసీపీ బరిలోకి దింపుతోంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురే మురుగుడు లావణ్య. అలాగే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు కూడా కావటం విశేషం. రెండు రాజకీయ కుటుంబాలకు చెందిన లావణ్యకు.. కుటుంబ నేపథ్యం, బీసీ కార్డు ఉపయోగపడుతుందనే కారణంతో వైసీపీ ఎంపిక చేసినట్లు తెలిసింది.