ఇక అమ్మాయిల ధనాధన్ యుఏఈలో వుమెన్స్ వరల్డ్ కప్

క్రికెట్ అభిమానులకు మరో మూడు వారాల పాటు పండగే... యుఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ గురువారం నుంచే మొదలుకాబోతోంది. నిజానికి బంగ్లాదేశ్ తో జరగాల్సిన ఈ టోర్నీ అక్కడి అనిశ్చితి పరిస్థితులతో ఎడారి దేశానికి షిప్ట్ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 3, 2024 | 01:43 PMLast Updated on: Oct 03, 2024 | 1:43 PM

Womens T20 World Cup

క్రికెట్ అభిమానులకు మరో మూడు వారాల పాటు పండగే… యుఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ గురువారం నుంచే మొదలుకాబోతోంది. నిజానికి బంగ్లాదేశ్ తో జరగాల్సిన ఈ టోర్నీ అక్కడి అనిశ్చితి పరిస్థితులతో ఎడారి దేశానికి షిప్ట్ అయింది. గత కొన్నేళ్ళుగా అమ్మాయిల క్రికెట్ కు ఆదరణ పెరిగింది. టాప్ జట్లతో పాటు చిన్న టీమ్స్ కూడా క్వాలిటీ క్రికెట్ ఆడుతుండడంతో స్టేడియాలకు ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు. అటు టీవీల్లోనూ వ్యూయర్ షిప్ కూడా బాగా పెరిగింది. దీంతో ఇప్పుడు జరగనున్న మెగా టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటిదాకా ఏ ఫార్మాట్లోనూ వరల్డ్ కప్ గెలవని భారత మహిళల జట్టు.. ఈసారి కప్పు కలను నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది.

2020లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన భారత్‌ వుమెన్స్ టీమ్ ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఈ సారి భారీ అంచనాలతో వరల్డ్ కప్ కు సిద్ధమైన భారత్ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ తలపడనుండగా.. రెండో మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఢీకొంటుంది. అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉన్న భారత మహిళల జట్టు అంచనాలకు తగ్గట్టు రాణిస్తే కప్ గెలిచే అవకాశముంది. మరోవైపు ఆరుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అలాగే ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లపైనా అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ మెగా టోర్నీలో 10 జట్లు పోటీ పడుతున్నాయి. అయిదేసి జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించగా… ఒక్కో జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు క్వాలిఫై అవుతాయి.