మహిళల టీ20 ప్రపంచకప్ ఇంగ్లాండ్ కు రెండో విజయం
మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ జట్టు అదరగొడుతోంది. సూపర్ ఫామ్ లో ఉన్న ఇంగ్లీష్ టీమ్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. షార్జా వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.

మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ జట్టు అదరగొడుతోంది. సూపర్ ఫామ్ లో ఉన్న ఇంగ్లీష్ టీమ్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. షార్జా వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఓ దశలో సౌతాఫ్రికా 88 రన్స్ తో మెరుగైన స్థితిలో నిలిచినా..కానీ ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి స్కోరుబోర్డును కట్టడిచేశారు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఈ విజయంతో ఇంగ్లీష్ టీమ్ గ్రూప్ బిలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్ళింది.