వరల్డ్ కప్ విజయాలే టార్గెట్, గుకేశ్ గెలుపు వెనుక భారత మాజీ కోచ్
దొమ్మరాజు గుకేశ్... ప్రస్తుతం భారత క్రీడారంగంలో మారుమోగిపోతున్న పేరు... 18 ఏళ్ళ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించిన చెస్ ప్లేయర్...పదేళ్ళ వయసు నుంచే సంచలన విజయాలతో దూసుకొచ్చిన గుకేశ్ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచి అందరి చూపునూ తనవైపు తిప్పుకున్నాడు.
దొమ్మరాజు గుకేశ్… ప్రస్తుతం భారత క్రీడారంగంలో మారుమోగిపోతున్న పేరు… 18 ఏళ్ళ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించిన చెస్ ప్లేయర్…పదేళ్ళ వయసు నుంచే సంచలన విజయాలతో దూసుకొచ్చిన గుకేశ్ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచి అందరి చూపునూ తనవైపు తిప్పుకున్నాడు. అయితే గుకేశ్ విజయం వెనుక టీమిండియా మాజీ కోచ్ ఉన్నాడని చాలా మందికి తెలీదు.. అతను ఎవరో కాదు ఒకప్పుడు భారత క్రికెట్ జట్టుకు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ గా ఉన్న ప్యాడీ ఆప్టన్…ఇప్పుడు అతడు గుకేశ్ కు కూడా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ గా ఉన్నాడు. గుకేశ్ వరల్డ్ ఛాంపియన్ గా నిలవడంలో ప్యాడీ ఆప్టన్ కీలక పాత్ర పోషించాడు.
మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా ప్యాడీ ఆప్టన్‌కు మంచి గుర్తింపు ఉంది. చెస్ అంటేనే మైండ్ గేమ్.. అలాంటి ఆటలో గుకేశ్ ఏకాగ్రత దెబ్బతినకుండా ప్యాడీ ఆప్టన్ అతనికి అండగా నిలిచాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో గుకేశ్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు చైనా ప్లేయర్ డింగ్ లిరెన్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అతను ఆ ట్రాప్‌లో పడలేదు. ప్యాడీ క్యాప్టన్ శిక్షణతో గుకేశ్ మానసిక బలాన్ని పెంచుకున్నాడు. ఆప్టన్ సూచనలతో గేమ్ లో సమయాన్ని ఎలా గడపాలి.. నిద్రను ఎలా సమన్వయం చేసుకోవాలి.. ఖాళీ సమయంలో ఏం చేయాలి.. ఇలా ప్రతీ విషయాన్ని గుకేశ్ పక్కాగా రూపొందించుకున్నాడు.
గుకేశ్ తన విజయం తర్వాత ప్యాడీ ఆప్టన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తానించాడు. ప్రపంచ ఛాంపియన్ కావాలంటే మానసికంగా దృఢంగా ఉండాలన్న విషయం తనకు తెలుసన్నాడు. తనకు ఉన్న సమస్యలపై ఆప్టన్ తో చర్చించానని, చక్కని సలహాలు ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో చెస్ ప్లేయర్స్ మెంటల్ కండిషనింగ్ కోచ్ ని కలిగి ఉండాలని గుకేశ్ సలహా ఇచ్చాడు. కాగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ప్యాడీ ఆప్టన్ మెంట్ స్ట్రెంగ్త్ కండీషన్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత కూడా సుదీర్ఘ కాలం టీమిండియాకు పని చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన భారత హాకీ టీమ్‌కు కూడా ప్యాడీ ఆప్టన్.. మానసిక కోచ్‌గా సేవలందించారు. భారత్ సాధించిన పలు చారిత్రక విజయాల్లో ప్యాడీ ఆప్టన్ భాగమవడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అతనికి థ్యాంక్స్ చెబుతున్నారు.