Vijay Devarakonda: విజయ్‌కి షాకిచ్చిన నిర్మాత.. డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ట్వీట్..
హీరో విజయ దేవరకొండకు షాక్ ఇచ్చిన లవర్ నిర్మాత.

The makers of World Famous Lover tweeted to give money to Vijay Deverakonda
చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు ఖుషీ సినిమా మంచి కంబ్యాక్‌లా మారింది. ఈ సినిమా విజయాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. రీసెంట్‌గా వైజాగ్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌కు కోటి రూపాయలు ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పాడు. వంద కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుంటుంబానికి లక్ష చొప్పున ఇస్తానంటూ చెప్పాడు. ఖుషీ సినిమాతో తాను సంపాదించిన డబ్బుతోనే ఈ పని చేయబోతున్నట్టు చెప్పాడు. తన ఆనందంతో పాటు సంపాదన కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటానంటూ చెప్పి కాస్త ఎమోషనల్ అయ్యాడు.
ఇదే విషయంలో రియాక్ట్ అయ్యారు వరల్డ్ ఫేమస్ లవర్ నిర్మాతలు. ఫ్యాన్స్‌కు డబ్బులు ఇవ్వడం కాదు. వరల్డ్ ఫేమస్ సినిమా వల్ల 8 కోట్లు నష్టం వచ్చింది. మీకు పెద్ద మనసు ఉంటే ఆ డబ్బులు నిర్మాణ సంస్థకు తిరిగి ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ట్విటర్ అకౌంట్ నుంచి వచ్చిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. విజయ్ కెరీర్‌లోని బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల్లో వరల్డ్ ఫేమస్ లవర్ ఒకటి. విజయ్ మేనియాకు తగ్గట్టుగా సినిమా ఉంటుంది అని అంతా అనుకున్నా.. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం అంచనాలు తలకిందులయ్యాయి. ఈ సినిమాలో నిర్మాతలు గట్టిగానే నష్టపోయారు. ఇప్పుడు విజయ్ చేసిన ప్రకటనతో తమ నష్టాన్ని కూడా కాస్త కవర్ చేయాలని కోరుతున్నారు. వీళ్ల రిక్వెస్ట్‌కు విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.