Puri Jagannath Rath Yatra 2024 : నేడు పూరీ జగన్నాథుని రథయాత్ర…

ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర సర్వ సిద్దం.. మరి కాసేపట్లో జగన్నాథుడి రథయాత్ర.. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 7, 2024 | 11:15 AMLast Updated on: Jul 07, 2024 | 11:15 AM

World Famous Puri Jagannath Rath Yatra All Ready Today Puri Jagannath Rath Yatra

ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర సర్వ సిద్దం.. మరి కాసేపట్లో జగన్నాథుడి రథయాత్ర.. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్స వాలన్నింటికల్లా ప్రత్యేకమైనది ఈ జగన్నాథ రథ యాత్ర.. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృ ష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగిస్తారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర తమ సింహాసనాలను వదిలేసి పెంచిన తల్లి గుండిచా దేవి వద్దకు ఈరోజు వెళ్తారని భక్తుల నమ్మిక.. ఆ మేరకే విగ్రహాలను 3 కి.మీ దూరంలోని అమ్మ వద్దకు చేరుస్తారు. ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. నేత్రపర్వంగా సాగే ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. కాగా ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత..

ఈ సంవత్సరం ప్రతేకత ఏంటంటే.. ఒకే సారి.. ఒకే రోజు.. నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర నేత్రపర్వండం ఇద తొలి సారి.. ఈ మూడు వేడుకలు నేడు ఒకేసారి జరగనుండడంతో నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్ రథాలు నేటి సాయంత్రానికి అమ్మవారి ఆలయానికి చేరుకునే అవకాశం తక్కువ.. దీంతో రేపు కూడా అంటే.. స్వామి సేవలు పూర్తయ్యే వరకు రథాలను మార్గమధ్యంలో నిలిపివేస్తారు. రేపు ఉదయం మళ్లీ రథాలను లాగుతారు. ఈ ఏడాది రెండు రోజుల పాటు భక్తులకు రథాలు లాగే భాగ్యం కలగనుంది. ఈ రథయాత్రకు మరో ప్రత్యేకత కూడా ఉంది. 1971 తర్వాత జగన్నాథ నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర ఒకేరోజు నిర్వహించడం ఇదే తొలిసారి. దాదాపు 53 ఏళ్ల తర్వాత ఈ అరుదైన సంఘటన రావడం విశేషం.. పూరీజగన్నాథుడి రథయాత్రలో తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటున్నారు. గతంలో రాష్ట్రపతులు ఎవరూ ఈ యాత్రకు హాజరు కాలేదు. గవర్నర్ రఘుబర్‌దాస్‌తో కలిసి సుభద్రమ్మ రథాన్ని రాష్ట్రపతి లాగుతారు. రాష్ట్ర పతితో పాటుగా.. ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు కూడా రథోత్సవంలో పాల్గొంటారు. రెండు రోజులపాటు జరిగే ఈ రథోత్సవంలో దాదాపు 15 లక్షల మంది వరకు భక్తులు పాల్గొంటారని అంచనా.. ఈ నేపథ్యంలో పూరిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.