బొక్కలో అంపైరింగ్, ఇదీ ఒక గెలుపేనా ?
క్రికెట్ లో ఆస్ట్రేలియా అంటేనే ఛీటింగ్... ఔట్ కాకున్నా పదేపదే అప్పీల్ చేయడం... ప్రత్యర్థి బ్యాటర్లను స్లెడ్జింగ్ చేయడం... పదేపదే మాటలతో రెచ్చగొట్టం... గెలుపు కోసం ఇవీ కంగారూలు చేసే పనులు... ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఇదే ఫాలో అవుతోంది... వాళ్ళకు తోడు చెత్త అంపైరింగ్ కూడా కలిసింది...
క్రికెట్ లో ఆస్ట్రేలియా అంటేనే ఛీటింగ్… ఔట్ కాకున్నా పదేపదే అప్పీల్ చేయడం… ప్రత్యర్థి బ్యాటర్లను స్లెడ్జింగ్ చేయడం… పదేపదే మాటలతో రెచ్చగొట్టం… గెలుపు కోసం ఇవీ కంగారూలు చేసే పనులు… ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఇదే ఫాలో అవుతోంది… వాళ్ళకు తోడు చెత్త అంపైరింగ్ కూడా కలిసింది… తొలి టెస్టులో కెఎల్ రాహుల్ ఔట్ వివాదం ఎవ్వరూ మరిచిపోలేదు.. ఇప్పుడు బాక్సింగ్ డే టెస్టులోనూ యశస్వి జైశ్వాల్ ఔట్ తీవ్ర వివాదాస్పదమైంది. ఫీల్డర్లు అప్పీల్ చేస్తే చేశారు.. థర్డ్ అంపైర్ కు కళ్ళు పోయాయా అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అసలు అంపైరింగ్ అంటే తటస్థంగా ఉండాలి కానీ ఇలా ఒక జట్టుకు సపోర్ట్ లా వ్యవహరిస్తారా అంటూ మండిపడుతున్నారు. యశస్వి బ్యాట్‍కు బంతి తగిలినట్టు స్నికో మీటర్‌లో చూపించకపోయినా థర్డ్ అంపైర్ ఓ కారణం వల్ల ఔట్ ఇచ్చేశారు. మ్యాచ్ లో ఆసీస్ గెలుపుకు, భారత్ ఓటమికి ఇదే టర్నింగ్ పాయింట్.
కమిన్స్ వేసిన బౌన్సర్ ను పుల్ షాట్ కొట్టేందుకు జైస్వాల్ ప్రయత్నించాడు. అయితే, బంతి కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఆసీస్ ఆటగాళ్లు క్యాచ్ కోసం అప్పీల్ చేయగా… ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా డీఆర్ఎస్ తీసుకుంది
ఈ క్యాచ్‍ను థర్డ్ అంపైర్ చాలా సేపు పరిశీలించారు. అయితే, జైస్వాల్ బ్యాట్‍కు బంతి తగిలినట్టు స్నికో మీటర్‌లో చూపించలేదు. కానీ బంతి దిశ మారిందనే కారణంతో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. ఈ ఔట్ పై స్టేడియంలోని భారత్ ఫ్యాన్స్ తీవ్ర నిరసన తెలిపారు. ఛీటర్స్ అంటూ ఆసీస్ ప్లేయర్స్ ను తిట్టిపోశారు. అటు అంపైరింగ్ కూడా చెత్తగా ఉందంటూ ఫైర్ అయ్యారు. కామెంటేటర్లు సైతం జైశ్వాల్ ఔట్ పై రెండు వర్గాలుగా విడిపోయారు. భారత మాజీలు జైశ్వాల్ ది నాటౌట్ అంటే… ఆసీస్ మాజీలు మాత్రం థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించారు. కానీ ఓవరాల్ గా ఈ సిరీస్ లో అంపైరింగ్ తప్పిదాలు హాట్ టాపిక్ గా మారాయి. టెక్నాలజీ ఉన్నా కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా భారత్ కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు వచ్చాయని, ఐసీసీ ఏం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చెత్త అంపైరింగ్ తో వచ్చిన గెలుపు…ఒక గెలుపేనా అంటూ ఆసీస్ జట్టుకు చురలకలు అంటిస్తున్నారు.