WTC ఫైనల్ ఆశలు గల్లంతే రెండో ప్లేస్ కు పడిపోయిన భారత్

ఒక్క సిరీస్ ఓటమి టీమిండియా కొంపముంచింది. అది కూడా సొంతగడ్డపై ఇలాంటి పరాజయాన్ని అభిమానులు ఎవ్వరూ ఊహించి ఉండరు. బంగ్లాదేశ్ పై గెలవగానే తోపుల్లా ఫీలయిన భారత క్రికెటర్లు న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో మాత్రం చేతులెత్తేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2024 | 11:37 AMLast Updated on: Nov 04, 2024 | 11:37 AM

Wtc Final Hopes Lost India Fell To The Second Place

ఒక్క సిరీస్ ఓటమి టీమిండియా కొంపముంచింది. అది కూడా సొంతగడ్డపై ఇలాంటి పరాజయాన్ని అభిమానులు ఎవ్వరూ ఊహించి ఉండరు. బంగ్లాదేశ్ పై గెలవగానే తోపుల్లా ఫీలయిన భారత క్రికెటర్లు న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో మాత్రం చేతులెత్తేశారు. ఫలితంగా సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవడం కూడా వైట్ వాష్ పరాభవాన్ని చవిచూశారు. నిన్నటి వరకూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ముందున్న టీమిండియా ఇప్పుడు కివీస్ చేతిలో వైట్ వాష్ తర్వాత వెనుకబడింది. టాప్ ప్లేస్ నుంచి రెండో స్థానానికి పడిపోయింది. ముంబై టెస్ట్ ఓటమి తర్వాత WTC పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానాన్ని కోల్పోయింది. 58.33శాతంతో రెండో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 62.50శాతంతో అగ్రస్థానంలోకి దూసుకెళ్ళింది. నిజానికి ఈ సిరీస్ ఆరంభానికి ముందు భారత్ 68.54 గెలుపు శాతంతో టాప్ ప్లేస్ లో ఉండగా… ఇప్పుడు మూడు టెస్టుల్లోనూ ఓడిపోయి ఏకంగా 10 పాయింట్లు చేజార్చుకుంది.

మరోవైపు న్యూజిలాండ్ తమ గెలుపు శాతాన్ని మెరుగుపర్చుకుని 54.55‌%తో నాలుగో స్థానానికి ఎగబాకింది. శ్రీలంక 55.56 శాతంతో మూడో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా ఐదో స్థానంలో నిలిచింది. అయితే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వడం భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశాలను భారీగా దెబ్బతీసింది. ఈ క్రమంలో ఫైనల్ చేరడం కష్టంగానే కనిపిస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియా తమ మిగిలిన 5 టెస్టుల్లో నాలుగింటిని ఖచ్చితంగా గెలవాలి. అలా జరిగితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా ముచ్చటగా మూడోసారి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరుతుంది. కానీ మన జట్టు ఐదు టెస్టులూ కంగారూలతో ఆడబోతోంది. అది కూడా వారి సొంతగడ్డపై నాలుగు మ్యాచ్ లలో గెలవడం అంత ఈజీ కాదు. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకున్నప్పటకీ ఈ సారి మాత్రం సిరీస్ హోరాహోరీగా సాగుతుందని చెప్పొచ్చు.

అటు ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరాలంటే తమ చివరి ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయం సాధించాలి. ఆసీస్ టీమిండియాతో అయిదు, శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నిజానికి ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే సొంతగడ్డపై ఆసీస్ జట్టే ఫేవరెట్. ఇప్పుడు కివీస్ తో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత అసలు టీమిండియా ఎంతవరకూ కంగారూలకు పోటీనిస్తుందనేది చూడాలి. అందుకే రానున్న భారత్, ఆసీస్ టెస్ట్ సిరీస్ రెండు జట్ల భవితవ్యాన్ని డిసైడ్ చేయబోతోంది. గత రెండు నెలలుగా సిరీస్ సిరీస్ కూ పలు జట్ల స్థానాలు మారుతూనే ఉన్నాయి. అయితే ఆసీస్ టూర్ లో భారత్ ఓడితే ఇక టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆశలు గల్లంతే .ఇక మూడో స్థానంలో ఉన్న శ్రీలంక తమ తదుపరి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచితీరాలి. న్యూజిలాండ్ తమ సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయాలి.