రెడ్ బుక్ కి కౌంటర్ గా వైసీపీ మరో బుక్…!

ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఇబ్బంది పెట్టిన నాయకులు, అధికారుల పేర్లను రెడ్ బుక్ లో మంత్రి నారా లోకేష్ చేర్చారు. ఇప్పుడు దాని అమలు జరుగుతోంది అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2024 | 12:59 PMLast Updated on: Aug 16, 2024 | 12:59 PM

Ycp Is Another Book As A Counter To Red Book

ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఇబ్బంది పెట్టిన నాయకులు, అధికారుల పేర్లను రెడ్ బుక్ లో మంత్రి నారా లోకేష్ చేర్చారు. ఇప్పుడు దాని అమలు జరుగుతోంది అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పలువురు మాజీ మంత్రులను టార్గెట్ చేసి సిఐడీ, ఏసీబీ సహా పలు విచారణ సంస్థలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం విచారణకు రంగం సిద్దం చేస్తోంది.

తమను ఇబ్బంది పెట్టిన జగన్ ను ఎలా అయినా ఇబ్బంది పెట్టాల్సిందే అంటూ ఇప్పుడు పట్టుదలగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వాధినేతలు. దీనితో రెడ్ బుక్ పై జాతీయ స్థాయిలో చర్చ మొదలయింది. ఈ తరుణంలో రెడ్ బుక్ కి కౌంటర్ గా మరో బుక్ ని ప్రవేశ పెట్టేందుకు వైసీపీ సిద్దమవుతోంది. గత ప్రభుత్వ హాయంలో టిడిపి నేతలు ఇబ్బందులు పాలు చేసిన ,ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేసిన లోకేష్… ఇప్పుడు ఓపెన్ చేయడంతో ఇప్పుడు టిడిపి కౌంటర్ గా గుడ్ బుక్ ను వైసీపీ మొదలుపెడుతోంది.

స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా తనని కలవడానికి వచ్చిన పార్టీ ముఖ్య నేతలతో రెడ్ బుక్ పై చర్చ జరిగింది. అదే సమయంలో మనం కూడా గుడ్ బుక్ పెడదామని నాయకులకు జగన్ చెప్పారు. ఎవరైతే సక్రమంగా వ్యవహరించారో వారి పేర్లన్నీ నమోదు చేద్దామా అని పార్టీ సీనియర్ నేతలు జగన్ ను అడిగారు. దీనితో చూద్దామంటూ తల ఊపారు జగన్. మరి రెడ్ బుక్ పై ఏ అడుగులు పడతాయో చూడాలి.