Kapu Ramachandra Reddy: బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. బీజేపీ అగ్రనేతలతో కాపు రామచంద్రారెడ్డి భేటీ
జగన్మోహన్ రెడ్డి తనను నమ్మించి గొంతు కోశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీతో తనకేం సంబంధం లేదన్నారు. తర్వాత వివిధ పార్టీల్లో చేరేందుకు ప్రయత్నించారు.
Kapu Ramachandra Reddy: వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. బీజేపీలో చేరబోతున్నారు. ఈ మేరకు తన ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను విజయవాడలో కలిసేందుకు.. ఆయన బస చేసిన హోటల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. “రాజనాథ్ సింగ్‌ను కలిసేందుకే వచ్చాను. మా జిల్లాకు సంబంధం లేని మీటింగ్ ఇక్కడ జరుగుతుంది. అందుకే మీటింగ్‌లో నుంచి బయటికి వచ్చేసాను.
Virat Kohli: కోహ్లీ ఐపీఎల్ ఆడటం డౌటే.. గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
ఎప్పుడు జాయిన్ అయ్యేది తర్వాత తెలియజేస్తాను. ప్రస్తుతానికి పూర్తిగా ఏ నిర్ణయం తీసుకోలేదు. నేను వైసిపిని పూర్తిగా వదిలేశాను. ఆ పార్టీతో నాకు సంబంధం లేదు. వచ్చే ఎన్నికలలో నేను పోటీ చేస్తున్నా. ఏ పార్టీ అనేది త్వరలో చెబుతా. వైసిపి మీటింగ్ నుంచి నాకు ఎటువంటి సమాచారం లేదు. రాజ్‌నాధ్‌సింగ్‌ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చా. ఆత్మీయంగా టీ తాగాం. త్వరలోనే అన్నివిషయాలు వివరిస్తా. ఆ తరువాత రాష్ట్రంలో పరిస్థితులపై మాట్లాడతా” అంటూ కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం నుంచి వైసీపీ తరఫున 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కాపు రామచంద్ర రెడ్డి =కి టికెట్ ఇవ్వటం కుదరదని సీఎం జగన్ చెప్పారు. దీంతో కాపు రామచంద్ర రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు నుంచి బయటకు వచ్చి సీఎం క్యాంప్ ఆఫీసుకు సెల్యూట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తనను నమ్మించి గొంతు కోశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీతో తనకేం సంబంధం లేదన్నారు.
తర్వాత వివిధ పార్టీల్లో చేరేందుకు ప్రయత్నించారు. కానీ ఏ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందడం లేదు. గతంలో కాంగ్రెస్ లోచేరాలని ప్రయత్నించారు. మడకశిర వెళ్లి ఆ పార్టీ అగ్రనేత రఘువీరారెడ్డితో సమావేశమయ్యారు. కానీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనపై ఆసక్తి చూపించ లేదు. ఇదే సమయంలో ఆయన చూపు బీజేపీపై పడింది. ప్రస్తుతం బీజేపీ, జనసే, టీడీపీ పొత్తు ఉంటుందనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలవొచ్చని కాపు రామచంద్రారెడ్డి భావిస్తున్నారు. అందుకే బీజేపీ అగ్రనేతలతో భేటీకి ప్రయత్నించారు. అయితే, బీజేపీ అగ్రనేతలు.. ఆయన విషయంలో ఎలా స్పందించారో తెలియాలి.