YCP STRATEGY : వైసీపీ మాస్టర్ స్ట్రాటజీ.. టీడీపీకి రెబల్స్ కి ఫండింగ్ – బాబుకి షాక్

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ( AP Assembly Elections) టీడీపీకి రెబెల్స్ షాక్ ఇవ్వబోతున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి పార్టీ అభ్యర్థిని దెబ్బకొట్టాలనుకోవడం కామనే అయినా... ఆ విషయంలో వాళ్ళకు ఊహించని మద్దతు దొరుకుతోంది. ఏమున్నా... ఏం కావాలన్నా మేం చూసుకుంటాం... మీరు మాత్రం తగ్గొద్దు అంటూ వైసీపీ అగ్రనేతలు... టీడీపీ (TDP) రెబల్స్ కి అన్ని రకాల సాయం చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2024 | 09:59 AMLast Updated on: Feb 13, 2024 | 9:59 AM

Ycps Master Strategy Tdps Funding Of Rebels Babus Shock

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ( AP Assembly Elections) టీడీపీకి రెబెల్స్ షాక్ ఇవ్వబోతున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి పార్టీ అభ్యర్థిని దెబ్బకొట్టాలనుకోవడం కామనే అయినా… ఆ విషయంలో వాళ్ళకు ఊహించని మద్దతు దొరుకుతోంది. ఏమున్నా… ఏం కావాలన్నా మేం చూసుకుంటాం… మీరు మాత్రం తగ్గొద్దు అంటూ వైసీపీ అగ్రనేతలు… టీడీపీ (TDP) రెబల్స్ కి అన్ని రకాల సాయం చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఇండిపెండెంట్స్‌ (Independents) రూపంలో టీడీపీలో డైనమైట్స్‌ పేల్చబోతోంది వైసీపీ. దాంతో ఓట్లు చీల్చి దెబ్బకొట్టబోతోంది.

అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఓ రేంజ్‌ లో కసరత్తు జరుగుతోంది. ఈసారి టిక్కెట్స్‌ లేవని కొంతమందికి ముందే చెప్పేస్తున్నారు. దాంతో రకరకాల ఈక్వేషన్స్‌తో టిక్కెట్ దక్కని నేతలు కొందరు ఇండిపెండెంట్స్‌గా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పార్టీ అభ్యర్థులకు సమాంతరంగా తాము కూడా రంగంలోకి దిగితే… చివరికి వాతావరణం తమకే అనకూలంగా ఉంటుందని లెక్కలేసుకుంటున్నారట ఆ లీడర్స్‌. ఆయా సెగ్మెంట్స్‌లో తమకున్న పట్టు, అనుచరగణం బలం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిసింది. అది అంతవరకే అయితే లెక్క వేరే. కానీ… ఇప్పుడు వ్యవహారం అంతకు మించి అన్నట్టుగా ఉందట. టిక్కెట్‌ రాదని తెలిసి స్వతంత్ర ఆలోచనలు చేస్తున్న టీడీపీ నాయకులకు… వైసీపీ (YCP) ముఖ్య నేతలు టచ్‌లోకి వెళ్తున్నట్టు సమాచారం.

ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు..? ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలనుకుంటున్నదెవరు? ఒకవేళ దిగితే వాళ్ళు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న కోణాల్లో సమాచారం రాబడుతూ కొత్త స్కెచ్‌ సిద్ధం చేసుకుంటోందన్నది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోడెల శివరాం స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతంకన్నా లక్ష్మీనారాయణ అక్కడ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు. అయితే కన్నాకు పోటీగా కోడెల శివరాం పని గట్టుకుని గ్రామాలను చుట్టేస్తున్నారు. ముందు ఎవరున్నా… ఫైనల్‌గా బరిలో తానే ఉంటానని కూడా చెబుతున్నారట. ఈ క్రమంలో పార్టీ అధినాయకత్వం కోడెల శివరాం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది.

ఇదే సందర్భంలో వైసీపీ నేతలు శివరాంతో టచ్ లోకి వెళ్ళారన్న సమాచారం పార్టీ ఆఫీస్‌కు చేరిందట. ప్రస్తుతం కోడెలను వైసీపీనే ఎగదోస్తోందని, కన్నాకు వ్యతిరేకంగా పని చేస్తూ.. ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు ఫ్యాన్‌ పార్టీ పక్కా ప్లాన్ సిద్దం చేసిందని.. దీన్ని గమనించుకోవాలని పార్టీ పెద్దలకు సమాచారం చేరిందట. ఇదే సందర్భంలో మరో ఫీడ్ బ్యాక్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఒక్క కోడెల విషయంలోనే కాకుండా.. ఇంకొందరు టీడీపీ అసంతృప్తుల్ని కూడా గుర్తించే పనిలో వైసీపీ ఉందన్నది ఆ ఫీడ్‌ బ్యాక్‌ సారాంశం. టీడీపీ అసంతృప్తులను ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపి.. ఆ పార్టీ ఓట్లను చీల్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పాయింట్‌ చుట్టూనే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ ముద్దరబోయిన వెంకటేశ్వర్లు లాంటి వారితో వైసీపీ ముఖ్యనాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయట పార్టీ పెద్దల్లో. వీరే కాకుండా.. వివిధ జిల్లాల్లో ఎవరెవరు కీలక నేతలు ఉన్నారో చూసుకుని.. అలాంటి వారిని గుర్తిస్తూ వైసీపీ ఓ జాబితా కూడా సిద్దం చేసిందనీ… తక్కువలో తక్కువ 10 నియోజకవర్గాల్లోనైనా స్వతంత్రులు బరిలో నిలిచేలా వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు టీడీపీ వర్గాలకు సమాచారం అందింది. టీడీపీ ఓట్లను వీలైనంత వరకు చీల్చేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వైసీపీ వదలడం లేదన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా కొంత మందిని వైసీపీ సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా స్వతంత్రంగా రంగంలోకి దిగే వారికి అవసరమైన సరుకు సరంజమా అందించేందుకు కూడా వైసీపీ సిద్ధంగా ఉందట. ఇప్పటికే ఓవైపు సీట్ల సర్దుబాటు.. మరోవైపు అభ్యర్థుల కసరత్తు లాంటి అంశాలతో బిజీగా ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు అసంతృప్తులు, ఇండిపెండెంట్స్‌ మీద ఫోకస్ పెట్టక తప్పని పరిస్థితి. ఈ విషయంలో ముందే జాగ్రత్త పడకుంటే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందన్న వార్నింగ్స్‌ వినపడుతున్నాయి. మరి ఈ స్వతంత్ర వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం ఎలా డీల్‌ చేస్తుందో చూడాలి.