Trollers : నిన్న ప్రణీత్.. ఇవాళ మరో దగుల్బాజీ.. అమర జవాన్ భార్యను వదలని ట్రోలర్స్..
స్వేచ్చ ఉంది.. సోషల్ మీడియా అకౌంట్ ఉంది.. ఇంగ్లీష్ జ్ఞానం ఉంది.. వెటకారం చేసే గుణం ఉంది కదా అని.. ఇష్టమొచ్చిన రాతలు రాస్తే పుట్టగతులు ఉండవు. ప్రణీత్ అనే నీచుడు చేసిన రచ్చను ఇంకా ఎవరూ మర్చిపోలేదు.
స్వేచ్చ ఉంది.. సోషల్ మీడియా అకౌంట్ ఉంది.. ఇంగ్లీష్ జ్ఞానం ఉంది.. వెటకారం చేసే గుణం ఉంది కదా అని.. ఇష్టమొచ్చిన రాతలు రాస్తే పుట్టగతులు ఉండవు. ప్రణీత్ అనే నీచుడు చేసిన రచ్చను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. తండ్రీ కూతుళ్ల బంధాన్ని తప్పుగా చూసిన ఆ దగుల్బాజీని వదలొద్దు అంటూ.. జనాలంతా డిమాండ్ చేస్తున్నారు. సినిమా స్టార్స్ నుంచి పొలిటీషియన్ల వరకు.. ఆ ప్రణీత్ మీద భగ్గుమంటున్నారు. ఈ చెండాలుడి గురించి చర్చ జరుగుతుండగానే.. అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. సోషల్ మీడియా భూతం.. ఓ కుటుంబాన్ని, ఓ వ్యక్తిని ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మరోసారి బయటపడింది.
అమర జవాన్ భార్యను వదలకుండా.. ట్రోల్స్ చేశారు కొందరు దరిద్రులు.. అంశుమన్ సింగ్ అనే జవాను.. సరిహద్దుల్లో అమరుడు అయ్యాడు. అతని త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం కీర్తిచక్ర అవార్డు ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా… అతని భార్య స్మృతి అవార్డును అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె చెప్పిన మాటలు ప్రతీ భారతీయుడి మనసును తడి చేసింది. ఐతే ఈ వీడియో మీద కొందరు నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. స్మృతి అందంగా ఉందని.. ఆమె ఏడుస్తుంటే తమ గుండె బద్దలవుతుంది అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీలు పెట్టారు. స్మృతిని చూసి కన్నీరు పెట్టుకోవాల్సింది పోయి.. ఆమె మీద అసభ్యకర కామెంట్స్ చేస్తూ రాక్షసానందం పొందారు. అమరుడి భార్యపైనా అసభ్యకరంగా స్పందిస్తూ ట్రోల్ చేస్తున్న వారికి కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయ్. దరిద్రమైన కామెంట్లు పెట్టిన ఢిల్లీకి చెందిన అహ్మద్ అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌కు పలువురు విన్నపాలు పంపించారు. స్పందించిన మహిళా కమిషన్… ఆ యువకుడు చేసిన అసభ్యకరమైన కామెంట్లను తీవ్రంగా ఖండించింది.
ఢిల్లీ పోలీసులు తక్షణమే అతడిని అరెస్ట్ చేయాలని, మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
సోషల్ మీడియాతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. ఇలాంటి దగుల్బాజీల వల్ల అది అంత భయంకరంగా మారుతోంది. మనిషికి స్వేచ్ఛ ముఖ్యమే, వాక్ స్వాతంత్రపు హక్కూ ప్రధానమే… ఐతే సోషల్ మీడియా కాలంలో విజ్ఞత మరిచిన, సంస్కారం కోల్పోయిన భావ ప్రకటనా స్వేచ్ఛ వెర్రెతలలు వేస్తుందనిపిస్తోంది. ఒకరిని ఇబ్బంది పెడుతూ.. ఒకరిని కష్టపెడుతూ.. రాసే రాతలు, మాట్లాడే మాటలు మంచివి కావు.. మట్టికొట్టుకుపోతారరేయ్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్.