Radhika ananth : ఒక్కొక్కరి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
రాజుగారింట్లో పెళ్లంటే వంటలకు కొదవ ఉంటుందా..? మరి.. అపరకుబేరుడి ఇంట్లో పెళ్లంటే సంబరాలకు కొదవ ఉంటుందా..? అందుకే.. అంబానీ ఇంట్లో ప్రీ సెలబ్రేషన్స్ ఓ సంబరంలా జరిగాయి.. ముకేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా (Anant Ambani, Radhika) మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు (Pre Wedding Ceremony) వరల్డ్ వైడ్‌గా హాట్‌టాపిక్‌గా మారాయి.

You will be shocked to know the remuneration of each person
రాజుగారింట్లో పెళ్లంటే వంటలకు కొదవ ఉంటుందా..? మరి.. అపరకుబేరుడి ఇంట్లో పెళ్లంటే సంబరాలకు కొదవ ఉంటుందా..? అందుకే.. అంబానీ ఇంట్లో ప్రీ సెలబ్రేషన్స్ ఓ సంబరంలా జరిగాయి.. ముకేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా (Anant Ambani, Radhika) మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు (Pre Wedding Ceremony) వరల్డ్ వైడ్‌గా హాట్‌టాపిక్‌గా మారాయి. గుజరాత్ జామ్‌నగర్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు దేశ విదేశాలకు చెందిన తారలంతా తరలి వచ్చారు. హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు సహా టాప్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో స్టార్లు చేసిన సందడి, చేసిన డ్యాన్సుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అయితే.. వీరిలో పలువురి స్టార్లు అంబానీ ఫ్యామిలీ నుంచి ఎంత వసూలు చేశారన్న విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హాలీవుడ్ ప్రముఖ సింగర్ రిహన్నా అదిరిపోయే స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈమెతో కలిసి సెలబ్రెటీలు కూడా ఆడిపాడి సందడి చేశారు. ఈమె పాటలకు సెలబ్రెటీలు సైతం ఊగిపోయి డాన్స్ చేశారు. అంబానీ కుటుంబ సభ్యులు కూడా ఆమెతో కలిసి వేదికపై డాన్స్ చేశారు. ఈ పెర్ఫార్మెన్స్‌కు గాను రిహన్నా ఏకంగా 75 కోట్ల వరకు రెమ్యూనరేషన్ వసూలు చేసిందట.. ఈ వేడుకల్లో భాగంగా రణ్‌బీర్-ఆలియా, దీపికా పదుకుణె-రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్-సైఫ్ తదితర బాలీవుడ్ జంటలు వేడుకల్లో డ్యాన్సులతో సందడి చేశారు. దీపికా పదుకుణె-రణ్‌వీర్ సింగ్ డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. ప్రగ్నెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత ఈ జంట తొలిసారి ఇలా డాన్స్ చేస్తూ కనిపించి ఆకట్టుకున్నారు. మరో వైపు బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ డ్యాన్సులతో అదరగొట్టారు. వెండితెరమీద స్టెప్పులేసే ఈ ఖాన్‌లు, ప్రీ వెడ్డింగ్‌లో వహ్వా అనిపించారు.
ఇక బాలీవుడ్ స్టార్ల సంగతికి వస్తే.. పలువురు స్టార్లు అంబానీ ఫ్యామిలీ నుంచి భారీగానే వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పెర్ఫార్మెన్స్‌కు గాను కత్రినా కైఫ్ మూడు కోట్లు, విక్కీ కౌశల్ కోటి రూపాయలు ఛార్జ్ చేశారట.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఎప్పియరెన్స్‌కు రెండు కోట్లు, పెర్ఫార్మెన్స్‌కు మూడు కోట్లు వసూలు చేశాడట.. ఇక ఖిలాడీ అక్షయ్ కుమార్ తన ఎప్పియరెన్స్ కోసం ఒకటిన్నర కోటి.. పెర్ఫార్మెన్స్ కోసం ఏకంగా రెండున్నర కోట్లు వసూలు చేశాడట.. ఇక.. బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ రణవీర్-దీపికా పదుకొనే జంట తమ స్టేజీ పెర్ఫార్మెన్స్ కోసం కోటి రూపాయల వరకు ఛార్జ్ చేశారట.. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంబానీ ఇంట్లోని ప్రీ వెడ్డింగ్ వేడుకలు స్టార్స్‌కు మంచి ఎంజాయ్‌మెంట్‌తో పాటు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌ను కూడా అందించాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.