యువక్రికెటర్ కు యాక్సిడెంట్ ముషీర్ ఖాన్ కు ఫ్రాక్చర్
టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ముషీర్ ఖాన్‌తో పాటు అతని తండ్రి నౌషద్ ఖాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ముషీర్ ఖాన్‌తో పాటు అతని తండ్రి నౌషద్ ఖాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరానీ కప్ కోసం కాన్పూర్ నుంచి లక్నోకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ముషీర్ ఖాన్‌కు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. లక్నో వేదికగా అక్టోబర్ 1 నుంచి ఇరానీ కప్ జరగనుండగా.. 19 ఏళ్ల ముషీర్ ఖాన్ ముంబై జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో ముషీర్ ఖాన్ ఇరానీ కప్‌తో పాటు అక్టోబర్ 11 నుంచి జరిగే రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లకు కూడా దూరం కానున్నాడు.
ముషీర్ ఖాన్ చాలా తక్కువ సమయంలోనే మంచి ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 50కి పైగా సగటుతో 716 పరుగులు చేశాడు. బంతితోనూ రాణించి 8 వికెట్లు తీసిన ముషీర్ ఖాన్ ఇటీవల దులీప్ ట్రోఫీలో ఇండియా-బీ తరఫున 181 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ముంబై రంజీ ట్రోఫీ విజయంలోనూ ఈ యువ క్రికెటర్ కీలక పాత్ర పోషించాడు. బరోడాపై డబుల్ సెంచరీ, విధర్భ జట్టుపై శతకం సాధించాడు. 19 ఏళ్ళ వయసులోనూ సీనియర్లకు ధీటుగా రాణిస్తున్న ముషీర్ ఖాన్ త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. కాగా తాజా ప్రమాదంతో ముషీర్ వచ్చే కొన్నాళ్ళ పాటు మైదానానికి దూరం కాక తప్పదు.