vijay devarkonda : ఫారిన్ అమ్మాయితో అర్జున్ రెడ్డి ముద్దు ముచ్చట్లు
యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రతి విషయంలో ట్రెండ్ అవుతున్నాడు. ఏం చేసినా అందరు తన వైపు చూస్తున్నారు.

Young sensation Vijay Deverakonda is trending in every aspect.
యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రతి విషయంలో ట్రెండ్ అవుతున్నాడు. ఏం చేసినా అందరు తన వైపు చూస్తున్నారు. స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న ఈ యంగ్ హీరో హిట్లు ఫ్లాప్ లు అని తేడా లేకుండా దూసుకుపోతున్నాడు. సినిమాలతో పాటు రష్మిక తో స్రీకెట్ లవ్ స్టోరీ నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న టైంలో విజయ్ ప్రైవేట్ ఫోటో లు లీక్ కాగా వైరల్ గా మారాయి.
కెరీర్ పరంగా దూసుకుపోతున్న విజయ్ ఓ ఫారిన్ అమ్మాయితో నడిపిస్తున్న ప్రేమాయణం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఫారిన్ అమ్మాయితో చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఆమెతో క్లోజ్ గా ఉండటంతో పాటు ఏకంగా ముద్దు పెడుతూ ఆ ఫొటోల్లోకనిపించడంతో నెటిజన్లు రకాలుగా చర్చించుకుంటున్నారు.
తెల్లతోలు పిల్లతో మన అర్జున్ రెడ్డి దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ ఆ అమ్మాయితో ముద్దు ముచ్చట్లు బాగున్నాయని… ఇంత క్లోజ్ గా కనిపిస్తున్న ఈ ఇద్దరి మధ్య ఏముందన్న డిస్కషన్ మొదలైంది. అయితే గతంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న ఫొటోలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి దేవరకొండ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.