టెస్టుల్లో టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ఆటగాళ్ళ స్వేఛ్ఛపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రికెటర్ల ఫ్యామిలీ టూర్లకు సంబంధించి కండీషన్లు పెట్టబోతున్నట్టు సమాచారం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దారుణ పరాభవం నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లకు కొత్త రూల్స్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఫారిన్ టోర్నీలకు క్రికెటర్లతో పాటు వారి ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లడంపై పలు ఆంక్షలు విధించినట్లు చెబుతోన్నారు. ప్రతి ఒక్క క్రికెటర్ ఈ కొత్త రూల్స్‌ను పాటించాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఫారిన్ టూర్లలో ఫ్యామిలీ మెంబర్స్ క్రికెటర్లు షికార్లు చేయడంపై బీసీసీఐ ఫైర్ అయినట్లు సమాచారం. ఇకపై 45 లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు సాగే సిరీస్ లలో క్రికెటర్లతో కలిసి వారి భార్యాపిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ కేవలం పధ్నాలుగు రోజులు మాత్రమే ఉండాలని బీసీసీఐ నిర్ణయించింది. టోర్నీ మొత్తం క్రికెటర్లతో కలిసి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఉండటానికి వీలులేదని ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్‌లో బీసీసీఐ వర్గాలు కండీషన్ పెట్టినట్లు సమాచారం. ఆటపై పూర్తి ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయంగా చెబుతున్నారు. అలాగే 15 నుంచి 20 రోజుల పాటు సాగే టూర్స్ లో అయితే క్రికెటర్లతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ 7 రోజులు మాత్రమే కలిసి ఉండాలని రూల్ పెట్టినట్లు సమాచారం. ఈ రూల్స్‌ను అతిక్రమించిన క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని తేల్చి చెపినట్టు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఏ టూర్ లోనైనా ఆటగాళ్ళు వ్యక్తిగతంగా జర్నీలు చేయడం కుదరదని బీసీసీఐ కండీషన్ విధించినట్లు తెలిసింది. టోర్నీ సమయాల్లో ఏ క్రికెటర్ అయిన టీమ్ బస్‌లోనే ప్రయాణించాలని తేల్చి చెప్పేసింది. విదేశీ టోర్నీలకు క్రికెటర్లతో కలిసి వారి భార్యా, పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లడం ఇటీవల కాలంలో రెగ్యులర్ గా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లి వైఫ్ అనుష్క శర్మ, కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి టోర్నీ ముగిసే వరకు ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. వీరితో పాటు పలువురు క్రికెటర్ల వెంట వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఫారిన్ టూర్లలను జల్సాలు తగ్గించి ఆటపై క్రికెటర్లు ఫోకస్ పెట్టాలనే ఈ కండీషన్స్ పెట్టినట్లు చెబుతోన్నారు. ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి గౌతమ్ గంభీర్‌తో పాటు అతడి మేనేజర్ గౌరవ్ అరోరా కూడా వెళ్ళడంపైనా బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. అతను జట్టు స్టే చేసిన హోటల్ లోనే ఉండడం, ఐదు టెస్ట్ మ్యాచులను వీఐపీ బాక్స్‌లలో కూర్చొని చూడడంపైనా విమర్శలు వచ్చాయి. దీనిపై గంభీర్ కు కూడా బీసీసీఐ వర్గాలు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యం ఆటగాళ్ళకు కొత్త రూల్స్ తెచ్చిపెట్టింది.[embed]https://www.youtube.com/watch?v=ziJlml-peLQ[/embed]