YouTube: యూట్యూబర్స్‌కు షాకిచ్చిన గూగుల్.. లక్షల వీడియోలు డిలీట్.. కారణం ఇదే..
మొత్తంగా 90,12,232 వీడియోలను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. ఇందులో అత్యధిక శాతం.. అంటే 25 శాతం వీడియోలు ఇండియావే కావడం గమనించదగ్గ విషయం. ఇండియాకు చెందిన ఛానెళ్ల నుంచి 22,54,902 వీడియోలను యూట్యూబ్ తొలగించింది.
YouTube: యూట్యూబర్లకు షాకిచ్చింది గూగుల్. గైడ్‌లైన్స్ పాటించని యూట్యూబ్ ఛానళ్లు, వీడియోలను డిలీట్ చేసినట్లు గూగుల్ ప్రకటించింది. యూట్యూబ్ యాజమాన్య కంపెనీ గూగుల్ అనే సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికను యూట్యూబ్ సమర్పించింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా తమ గైడ్‌లైన్స్ పాటించని 90 లక్షలకు పైగా వీడియోలను డిలీట్ చేసింది.
Prabhas : సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి వాయిదా
మొత్తంగా 90,12,232 వీడియోలను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. ఇందులో అత్యధిక శాతం.. అంటే 25 శాతం వీడియోలు ఇండియావే కావడం గమనించదగ్గ విషయం. ఇండియాకు చెందిన ఛానెళ్ల నుంచి 22,54,902 వీడియోలను యూట్యూబ్ తొలగించింది. ఆ తర్వాత రెండో స్థానంలో సింగపూర్, మూడో స్థానంలో అమెరికా ఉన్నాయి. సింగపూర్ నుంచి అప్‌లోడ్ అయిన 12,43,871 వీడియోలు, అమెరికా నుంచి అప్‌లోడ్ అయిన 7,88,354 వీడియోలను కంపెనీ తొలగించింది. వీడియోలతోపాటు రెండు కోట్ల ఛానెళ్లను కూడా తొలగించింది. యూట్యూబ్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం.. తొలగించిన వీడియోల్లో 39 శాతం ప్రమాదకరమైనవి కాగా.. 32 శాతం వీడియోలు పిల్లల భద్రతకు సమస్యగా మారే అవకాశం ఉంది. అలాగే 7.5 శాతం వీడియోలు హింసాత్మకంగా లేదా అశ్లీలంగా ఉన్నాయి. అనేక వీడియోల్లో వేధింపులు, న్యూడిటీ లేదా సెక్సువల్ కంటెంట్, హింస, బెదిరింపులు, తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి కారణాలు ఉన్నాయి.
మొత్తం మొత్తం 2,05,92,341 ఛానెళ్లను తొలగించారు. వీటిలో 92 శాతం ఛానెళ్లను స్పామ్, తప్పుదారి పట్టించే లేదా మోసపూరిత కంటెంట్ వల్ల తొలగించగా, న్యూడిటీ లేదా సెక్సువల్ కంటెంట్ కారణంగా 4.5 శాతం ఛానెళ్లు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు 0.9 శాతం ఛానెళ్లను తొలగించారు. డిలీట్ చేసిన వీడియోల్లో 51.15 శాతం వీడియోలు జీరో వ్యూస్ కలిగి ఉండటం విశేషం. 26 శాతం వీడియోలు పది వ్యూస్‌లోపే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు, ఛానెళ్లను గుర్తించి తొలగించేందుకు ‘ఆటోమేటిక్ ఫ్లాగింగ్’ అనే సిస్టమ్‌ను యూట్యూబ్ ఉపయోగించింది. మూడు నెలల వ్యవధిలోనే.. గైడ్‌లైన్స్ పాటించని ఛానెళ్లకు యూట్యూబ్ భారీ షాకిచ్చింది.