YS JAGAN MANIFESTO: కూటమి పథకాలకు లక్షన్నర కోట్లు.. బాబూ.. ఆ నిధులెలా వస్తాయ్
2019 నుంచి ఇప్పటి దాకా ఐదేళ్ళ కాలంలో తాము ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చామో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా వివరించారు ఏపీ సీఎం జగన్. కరోనా టైమ్‌లో ఆర్థిక కష్టాలు వచ్చినా వెనకడుగు వేయలేదన్నారు.
YS JAGAN MANIFESTO: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. తాను చేయగలిగిందే మాత్రమే చెప్పానని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సూపర్ 6 హామీల గురించి కూడా ప్రస్తావించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇస్తున్న హామీల అమలుకు ఎంత ఖర్చవుతాయి, ఏపీకి ఎంత అప్పు ఉందో.. లెక్కలు వేసి చూపించారు జగన్. 2019 నుంచి ఇప్పటి దాకా ఐదేళ్ళ కాలంలో తాము ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చామో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా వివరించారు ఏపీ సీఎం జగన్.
YS JAGAN: ఆనవాళ్లే లేవుగా! బ్యాండేజీ తీసిన జగన్.. కనిపించని గాయం గుర్తులు..
కరోనా టైమ్‌లో ఆర్థిక కష్టాలు వచ్చినా వెనకడుగు వేయలేదన్నారు. మొత్తం 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలను పథకాల కోసం ఖర్చు చేశామన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం తరపున టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన సూపర్ 6 హామీల గురించి వివరించారు జగన్. ఆ హామీలను అమలు చేయాలంటే.. 1 లక్షా 21 వేల కోట్లు ఖర్చవుతాయి. వీటితో పాటు ఖచ్చితంగా అమలు చేయాల్సిన కొన్ని పథకాలను కలిపితే లక్షా 50 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయన్నారు జగన్. ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఫీజు రియంబర్స్‌మెంట్, గోరుముద్ద పథకాలను ఎవరూ ఆపలేరని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పథకాలకు 70వేల కోట్ల దాకా సమకూర్చుకోవడమే కష్టమైందనీ.. అయినా అమలు చేశామన్నారు ఏపీ సీఎం జగన్.
బాబు ఇంతకు రెట్టింపు నిధులు.. లక్షన్నర కోట్లు ఫండ్స్ తేవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సంపద సృష్టిస్తామని చెబుతున్న బాబు మాటలు బూటకమనీ.. ఆయన 14 యేళ్ళ పాలనలో రాష్ట్రం లోటు బడ్జెట్‌తోనే కొనసాగినట్టు అంకెలతో సహా వివరించారు జగన్. 2014-19 మధ్య కాలంలో బాబు హయాంలో అప్పులు 21.8శాతానికి పెరిగినట్టు ఏపీ సీఎం గుర్తు చేశారు. 2014లో నాడు కూటమి నేతలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు ఏపీ సీఎం జగన్.